/rtv/media/media_files/2025/01/20/WKkVhr1eXLnoxluGj0EH.jpg)
Indonesia’s Mount Ibu volcano
Mount Ibu Erupts: ఇండోనేషియాలోని మౌంట్ ఇబు అనే అగ్నిపర్వతం అక్కడి ప్రజలను భయపెడుతోంది. జనవరి నెలలో ఏకంగా వెయ్యిసార్లు విస్ఫోటనం జరగిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. రాబోయే రోజుల్లో దీని తీవ్రత మరింత ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అగ్నిపర్వతానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. నార్త్ మలుకు అనే ప్రావిన్స్‌లోని హల్మహేరా అనే ద్వీపంలో ఈ మౌంట్ ఇబు అగ్ని పర్వతం విస్ఫోటనం చెందుతూనే ఉంది.
Also Read: ఏడు విమానాలు, ది బీస్ట్ కారు : ట్రంప్ సెక్యూరిటీ చూస్తే మతి పోవాల్సిందే!
ఒక్కరోజే 17 సార్లు (Mount Ibu Erupts)
ఇప్పటిదాకా ఆ అగ్నిపర్వతం నుంచి గాలిలోకి 0.3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకు బుడిద ఎగిసిపడింది. ఆదివారం 1.5 కిలోమీటర్ల వరకు బుడిద కనిపించింది. అంతేకాదు మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు కూడా విస్ఫోటనం శబ్దం వినిపించిందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఆదివారం ఒక్కరోజే 17 సార్లు అగ్నిపర్వతం బద్ధలైనట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్
ముందస్తు చర్యల్లో భాగంగా ఆరు గ్రామాల్లో ఉన్న మూడు వేల మందిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ పనులు కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది గ్రామస్థులు మాత్రం అధికారుల హెచ్చరికలను పాటించడం లేదు. అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. తమ పంటలను మధ్యలో వదిలి వచ్చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అధికారులు వాళ్లకి నచ్చజెబుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: జూనియర్ డాక్టర్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. సంజయ్ కి జీవిత ఖైదు!
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు