India-US: ముగింపుదశకు చేరుకున్న అమెరికా-భారత్ వాణిజ్య డీల్..టారిఫ్ లపై కూడా తగ్గింపు?

అమెరికా, భారత్ ల మధ్య ట్రేడ్ డీల్ లోని మొదటి దశ ముగింపుకు దగ్గరగా ఉందని తెలుస్తోంది. తొందరలోనే దానిని ప్రకటిస్తారని..దీని తర్వాత సుంకాలపై కూడా 50 శాతం తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు.

New Update
Modi-Trump wishing

భారతదేశం, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు, ఆరు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు మొదటి దశ ట్రేడ్ డీల్ కు దగ్గరలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా మార్కెట్ యాక్సెస్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, భారతీయ వస్తువులపై ట్రంప్ పరిపాలన విధించిన భారీ 50 శాతం తగ్గిస్తారని చెప్పారు. BTA పై మేము అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాము. ఇందులో రెండు భాగాలున్నాయని..మొదటిది ఈజీగా పరిష్కరించడానికి అనువైనవిఅని...అవే ఇప్పుడు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు. రెండవ దానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పారు. పరస్పర సుంకాలను పరిష్కరించగల ప్యాకేజీ దాదాపు ముగింపుకు దగ్గరగా ఉందని స్పష్టం చేశారు. దీని తరువాత భారత్ పై 25శాతం సుంకాల తగ్గుతాయని భావిస్తున్నామని ఆ అధికారి తెలిపారు.

సుంకాల తర్వాత కూడా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి..

యూఎస్, ఇండియా ట్రేడ్ డీల్ లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత USD 191 బిలియన్ల నుండి 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారి తెలిపారు. బాదం, పిస్తాపప్పులు, ఆపిల్స్, ఇథనాల్, జన్యుపరంగా మార్పు చేయబడిన వస్తువులు వంటి దాని ఉత్పత్తులకు అమెరికా ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. 2024-25లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ద్వైపాక్షిక వాణిజ్యం విలువ USD 131.84 బిలియన్లుగా ఉంది. ఇది భారత్ మొత్తం వస్తువుల ఎగుమతుల్లో దాదాపు 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం. అలాగే దేశం మొత్తం వస్తువుల వ్యాపారంలో 10.73 శాతం వాటా కలిగి ఉందని అధికారి లెక్కలు చెప్పారు.

రష్యాతో వ్యాపారం చేస్తే 500శాతం సుంకాలు..

మరోవైపు రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై ఆంక్షలు విధించే కొత్త బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ బలమైన మద్దతు ప్రకటించారు. ఈ బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే.. రష్యాతో వ్యాపారం చేసే దేశాల దిగుమతులపై 500 శాతం వరకు టారిఫ్‌లను విధించనున్నారు. రష్యాకు చైనా తర్వాత రెండో అతిపెద్ద ఇంధన కొనుగోలుదారుగా ఉన్న భారత్‌ ఉంది. ట్రంప్ మద్దతు ఇచ్చిన బిల్లు కనుక ఆమోదం పొందితే చైనాతో పాటూ, భారత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ కొత్త బిల్లు ట్రంప్‌కు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 500 శాతం వరకు టారిఫ్‌లను విధించే అధికారాన్ని ఇస్తుంది. దీనిపై భారత అధికారి మాట్లాడుతూ..ఇంకా దాని లోతుగా విశ్లేషించలేదని చెప్పారు. కానీ ఒక దేశంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశం వారి ద్వైపాక్షిక సంబంధం, వారి ఆర్థిక అవసరాల ఆధారంగా ఇతర దేశాలతో వ్యాపారం చేస్తామని..భారత వాణిజ్య నిర్ణయాలు దాని ద్వారానే మార్గనిర్దేశం చేయబడతాయని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Delhi Blast Update: హమాస్ తరహా దాడులకు ప్లాన్..ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు

Advertisment
తాజా కథనాలు