Free Trade Agreement: భారత్, బ్రిటన్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం

ఇండియా, భారత్‌‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌ ద్వారా తెలిపారు. భారతదేశం, UK డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌తో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నిచేసుకున్నాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

New Update
India UK Free Trade Agreement

ఇండియా, బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బ్రిటన్, భారత్ దేశాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎక్స్‌ ద్వారా తెలిపారు. భారతదేశం, UK డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్‌తో పాటు ప్రతిష్టాత్మకమైన పరస్పరం ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా ముగించాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ ఒప్పందాలు మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతాయి.

మన రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలలో వాణిజ్యం, పెట్టుబడి, వృద్ధి, ఉద్యోగ సృష్టి మరియు ఆవిష్కరణలను పెంపోదిస్తాయన్నారు. త్వరలో బ్రిటన్ PM కీర్ స్టార్మర్‌ను భారతదేశానికి స్వాగతించడానికి నేను ఎదురు చూస్తున్నానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు ఆర్థిక వ్యవస్థలలో వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ మరియు ఉద్యోగ సృష్టిని పెంపొందించే ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా వారు అభివర్ణించారు.

ఈ రోజు బ్రిటన్ భారతదేశంతో ఓ గొప్ప వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుందని యూకే ప్రధాని స్టార్మర్ ఎక్స్‌లో తెలిపారు. బ్రిటిష్ వ్యాపారాలు, బ్రిటిష్ కార్మికులు, దుకాణదారులకు అద్భుతమైన వార్త, మా మార్పు ప్రణాళికను అందజేస్తోందని UK ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

(pm modi | britan | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు