RIC: భారత్, రష్యాలతో పాటూ యుద్ధంలోకి చైనా...అమెరికాకు మూడినట్టేనా..

ఇండియా, అమెరికాలు ఇప్పుడు బద్ధ శత్రువులయ్యాయి. రష్యా నుంచి భారత్ చమురు కొంటుందనే ఆరోపణలతో అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీనిలో యూఎస్ కు వ్యతిరేకంగా భారత్ కు మద్దతుగా రష్యాతో పాటూ చైనాకు నిలుచనుంది. దీంతో అగ్రరాజ్యానికి మూడినట్టే అంటున్నారు. 

New Update

భారత్, రష్యా, చైనా...మూడు పెద్ద దేశాలు ఒక్కటవ్వబోతున్నాయా..మూడు కలిసి కూటమిగా ఏర్పడనున్నాయి అంటూ అవుననే అంటున్నారు విశ్లేషకులు. అమెరికాతో భారత్ గొడవ మిగతా దేశాలతో కలిసేలా చేసిందని చెబుతున్నారు. దీంతో అమెరికా ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న పెద్దన్న ట్రంప్ కు చుక్కలే అని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు భారత్ సూపర్ పవర్ గా ఎదగడమే కాకుండా...చైనా తో ఉన్న వైరం కూడా పోతుందని విశ్లేషిస్తున్నారు. 

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి..

ఎప్పటి నుంచో అమెరికా అగ్రరాజ్యం. అయితే గత కొన్నేళ్ళుగా అమెరికా ఆర్థికంగా దీవాలా తీస్తోంది. పైకి బాగానే కనిపిస్తున్నా విపరీతమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను బాగు చేస్తానంటూ ట్రంప్ వచ్చారు. అమెరికాను తిరిగి అగ్రరాజ్యంగా నిలబెడతా అనే ప్రామిస్ తో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో పాటూ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేసి శాంతిని నెలకొల్పుతానని ప్రగల్భాలు పలికారు. ఈ రెండింటి కోసం అమెరికాలో చాలానే మార్పులు చేశారు ట్రంప్. దాంతో పాటూ ప్రపంచ దేశాల మీద సుంకాల దాడికి దిగారు. దాదాపు అమెరికాతో వ్యాపారం చేస్తున్న అన్ని దేశాల మీదనా సుంకాలు విధించారు. అయితే చాలా దేశాలు దీన్ని ప్రతిఘటించాయి. దీంతో కొన్ని రోజుల పాటూ వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ సుంకాలు అమలు అవుతాయని టారీఫ్ ల యుద్ధం మొదలెట్టారు.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగలేదు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అదైనా సరిగ్గా అమలవుతోందా అంటే.. అదీ లేదు. దీంతో రష్యా మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదని భారత్ లాంటి దేశాలకు ఆంక్షలు విధించారు. పాటించకపోతే అదనపు సుంకాలు విధిస్తానని బెదిరించారు. అయితే భారత్ వినలేదు. దీంతో ఇండియాపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు ఎప్పటి నుంచో రష్యా, చైనాపై ప్రతీకార సుంకాలు అమల్లో ఉన్నాయి. 

వాణిజ్య యుద్ధం..

ఈ పరిస్థితి ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారి తీసింది. భారత్ తో అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుపై చాలా దేశాలు మండిపడుతున్నాయి. మన దేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి రష్యా, చైనా. ఎలాగో తమ దగ్గరే చమురు కొనుక్కుంటే, వాణిజ్య పరంగా మిత్ర దేశం కాబట్టి రష్యా సపోర్ట్ చేసింది. ఇప్పుడు దానికి తోడు అమెరికా బద్ధ శత్రువు, గట్టి పోటీ అయిన చైనా కూడా భారత్ కు మద్దతు పలికింది. మామూలుగా అయితే ఇండియా, చైనా సరిహద్దు దేశాలు. ఈ రెండు దేశాలకూ చాలా తగవులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా మీద ప్రతీకారం కోసం ఈ రెండు దేశాలు చేతులు కలపడానికి రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఏడేళ్ళ తర్వాత చైనా వెళ్ళడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ ( SCO )’ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మోదీ టూర్ ఓకే అయితే.. చైనా విదేశాంగ మంత్రి భారత్ వచ్చి జిన్‌పింగ్-మోదీ సమావేశంలో చర్చించే ఎజెండాపై సమాలోచనలు చేయనున్నారు. ఈ ఎస్సీవో సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో మూడు దేశాధినేతల మధ్య అమెరికా, సుంకాల విషయం చర్చకు రావచ్చని అంటున్నారు. ట్రంప్ ఆధిపత్యంపై ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషిస్తున్నారు.

అమెరికాకు పెద్ద దెబ్బే..

అమెరికా ఆటలు ఇంక సాగవు అని చెప్పే టైమ్ దగ్గర పడిందని విశ్లేషకులు అంటున్నారు.   తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని అనుకుంటున్న అమెరికా ఆధిపత్య ధోరణికి ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో రెండు దశాబ్దాలుగా ఉన్న సంబంధాలకు బీటలు పడ్డాయి.  ఇప్పటికు రష్యా, చైనాలు అమెరికా మీద కాలు దువ్వుతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు భారత్ కూడా యాడ్ అయింది. దీంతో ప్రపంచ స్థితిగతులు మారతాయి అని అంటున్నారు. మల్టీ పోలార్ ఆర్డర్ ఆమెరికా ఆధిపత్యానికి అడ్డకట్ట వేస్తుందని చెబుతున్నారు. పైగా భారత్, రష్యా, చైనా ఈ మూడు దేశాలు ఇప్పుడు ప్రపంచంలో చాలా బలంగా ఉన్నాయి. 

భారత్..

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ వ్యాహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒక సైనిక శక్తిని పెంచుకుంటూనే ప్రపంచ దేశాలతో దౌత్య సబంధాలు పెంచుకుంటూ వస్తోంది. స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక, వ్యూహాత్మక.. లక్ష్యాలు, విలువలకు ప్రాధాన్యం ఇస్తోంది. చైనా ఆధిపత్యాన్ని కూడా సవాల్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏ దేశంపై ఆధిపత్య ధోరణి వహించకుండా.. వాటి ప్రయోజనాలకు గౌరవం ఇస్తోంది.

రష్యా..

ఉక్రెయిన్ పై వార్ చేస్తూ ఎవరికీ భయపడకుండా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది రష్యా. అగ్రరాజ్యం అమెరికానే సవాల్ చేస్తూ ముందు వెళుతోంది. అంతర్జాతీయ కూటములు, సంస్థల్లో అమెరికా స్థానానికి రష్యా ఎసరు పెడుతూ.. అమెరికా నేతృత్వంలోని వరల్డ్ ఆర్డర్‌ను, ఆధిపత్యాన్ని ఒప్పుకోవడం లేదు. దౌత్య పరంగా భారత్, చైనా వంటి దేశాలతో సబంధాలు నెరుపుతూ..బ్రిక్స్ లాంటి కూటముల్లో కీలకంగా ఉంటోంది. 

చైనా..

చైనా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఆర్థికంగా, సాంకేతికంగా, మిలటరీ పరంగా కూడా అన్ని దేశాల కంటే చాలా ముందుంది ఈ  దేశం. నిజానికి అమెరికాను కూడా పక్కన పెట్టేయగల సామర్ధ్యం చైనాకు ఉంది. ఎప్పటి నుంచో అమెరికా మీద కాలుదువ్వుతోంది చైనా. అయితే ఎంత బలమున్నా ఆ దేశం ఒక్కటీ అమెరికాతో పోటీ చేయడం కుదరదు. దానికి భారత్, రష్యాల్లాంటి వారి సహకారం ఎంతో అవసరం. ఇప్పుడు అమెరికాకు భారత్కు మధ్య చెడడంతో దీన్ని ఒక అవకాశంలా వాడుకోవాలని అనుకుంటోంది చైనా. అమెరికాను పడగొట్టానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది. అందుకే టారీఫ్ ల విషయంలో భారత్ కు మద్దతు పలికింది. అమెరికా అన్యాయంగా ప్రవర్తిస్తోందంటూ స్టేట్ మెంట్ లు ఇస్తోంది.

ఇవన్నీ చూస్తుంటే వీటిని బట్టి భారత్, రష్యా, చైనాలకు వ్యూహాత్మకంగా అమెరికాను ఒంటరి చేయగల సామర్థ్యం ఉందని అర్థం అవుతోంది. అయితే దీనికి మూడు దేశాలు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే విషయాల్లో ఒక ఒప్పందానికి కూడా రావాల్సి ఉంటుంది. చైనా కొంచెం తగ్గాల్సి వస్తుంది. ముఖ్యంగా భారత్ తో తన వైఖరిని మార్చుకోవాల్సి అగత్యం ఏర్పడుతుంది. ఇవన్నీ జరిగితే రష్యా, భారత్, చైనాలు కలిసి ఒక సూపర్ పవర్ గా మారే అవకాశం ఉంటుంది. 

Also Read: Tariff War: దెబ్బకు దెబ్బ..ప్రతీకార సుంకాల తర్వాత బోయింగ్ విమానాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్

Advertisment
తాజా కథనాలు