USA: ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని

వచ్చే నెల ఫిబ్రవరిలో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నిన్న ఇరు దేశాధినేతలూ ఫోన్ లో మాట్లాడుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

New Update
usa

Pm Narendra Modi, President Trump

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను భారత ప్రధాని మోదీ (PM Modi) త్వరలోనే కలవనున్నారు. వచ్చే నెల ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్ స్వయంగా చెప్పారు. అయితే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యత చేపట్టాక ట్రంప్ తో మోదీ నిన్న మొదటిసారి ఫోన్ లో మాట్లాడారు. ఈసందర్బంగా ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. భారత్ తో తమకు మంచి సంబంధం ఉందని..ఫోన్ లో చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంలోనే విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వచ్చే నెలలో భారత ప్రధాని మోదీ అమెరికాకు రావొచ్చని ట్రంప్ చెప్పారు. 

ఇక నిన్న ఫోన్ కాల్ లో ఇరు దేశాధినేతల మధ్యనా సుదీర్ఘ చర్చలు జరిగాయి. అక్రమ వలసలను తాము వ్యతిరేకిస్తున్నామని, అమెరికా (USA) లో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్  తెలిపింది. ప్రపంచ శాంతి కోసం అమెరికా, భారత్ కలిసి పనిచేస్తాయని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్‌ సరైన నిర్ణయం తీసుకుంటుందని నేను విశ్వసిస్తున్నా అని అన్నారు. 

Also Read: Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

Also Read :  డిపోర్టేషన్...అమెరికాపై మండిపడుతున్న బ్రెజిల్, కొలంబియా

Advertisment
తాజా కథనాలు