USA: డిపోర్టేషన్...అమెరికాపై మండిపడుతున్న బ్రెజిల్, కొలంబియా

అక్రమ వలసదారులను అమెరికా వెనక్కు పంపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బ్రెజిల్, కొలంబియా. తమ దేశ పౌరుల చేతులకు సంకెళ్ళు వేసి పంపించడం వారి పౌర హక్కులను కాలరాసినట్టే అని వ్యాఖ్యానించాయి. వారితో వస్తున్న విమానాలను అనుమతించమని స్పష్టం చేశాయి.

author-image
By Manogna alamuru
New Update
usa

USA Deportation

 

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే ట్రంప్ అక్రమవలదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సరైన పేపర్స్ లేకుండా ఉన్నవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు కూడా. అయితే అగ్రరాజ్యం కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంపై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చేయడం సరైన సని కాదని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  

Also Read: HYD: హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం..రెండు బోట్లు దగ్ధం

కొలంబియా, బ్రెజిల్ ఆగ్రహం..

అమెరికాలో దాదాపు వెయ్యి మంది అక్రమ వలసదారులను అధికారులు గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకుని వారి వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక విమానాలను కూడా సిద్ధం చేశారు. అయితే వలసదారులను ఇలా పంపించడంపై కొలంబియా, బ్రెజిల్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వలసదారులతో వచ్చే విమానాలను అనుమతించమని కొలంబియా  తేల్చి చెప్పింది. కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను మా దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నా అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో చెప్పారు.  వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమరికా నిబంధనలను రూపొందిస్తేనే విమానాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. అలా లేని వాటిని వెనక్కి పంపించామని తెలిపారు. తమ దేశస్థులను నేరస్థులుగా చిత్రీకరించకుండా..మామూలు విమానాల్లో పంపిస్తేనే అనుతిస్తామని గస్తావో చెప్పారు.   

మరోవైపు తమ పౌరులకు సంకెళ్ళు వేసి ఇలా ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంపై బ్రెజిల్ అసహనం వ్యక్తం చేసింది. సంకెళ్ళు వేసి పంపించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని అంది. 

Also Read: Siraj: ఆమె నాకు చెల్లెలులాంటి..నన్ను వదిలేయండి..మహ్మద్ సిరాజ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు