No Talks: చమురు కొనుగోలుపై ప్రధాని మోదీ, ట్రంప్‌లు మాట్లాడుకోలేదు..కన్ఫార్మ్ చేసిన భారత్

రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 

New Update
ranadheer

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని...రష్యా చమురు గురించి వారు మాట్లాడుకోలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తోసిపుచ్చింది. దేశాధినేతలు ఇద్దరూ మాట్లాడుకోవడం తనకు తెలియదని..చమురుపై అంగీకారానికి రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.  

నిన్న ఓవల్ ఆఫీసులో..

ఇక మీదట రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోదీ తనకు ఈ రకమైన హామీ ఇచ్చారని తెలిపారు ఉక్రెయిన్ తో జరిగే యుద్ధంలో రష్యా ను ఒంటరి చేయడంలో ఇదొక కీలకమైన అడుగని ట్రంప్ పేర్కొన్నారు. వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలను చేశారు. రష్యాతో చమురు వ్యాపారం చేయడంపై మోదీతో మాట్లాడానని..ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. భారత్...రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వలన నిధులు అందుతున్నాయని...దీంతోనే పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తాము భావిస్తున్నామని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తాను చాలా రోజుల నుంచి సంతోషంగా లేనని ట్రంప్ అన్నారు. ఇదే విషయాన్ని మోదీ దగ్గర వ్యక్తం చేశానని చెప్పారు. ఇక మీదట చమురు కొనుగోలు చేయమని చెప్పారని..తనకు హామీ ఇచ్చారని చెప్పారు.

యుద్ధం ముగిసాక...

అలాగే రష్యా...ఉక్రెయిన్ తో మానేసిన తర్వాత కావాలంటే భారత్ మాస్కోతో మళ్ళీ చమురు వ్యాపారం కొనసాగించవచ్చని కూడా ట్రంప్ అన్నారు. కేవలం ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేత యుద్ధం మానిపించడానికి, ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే చమురు కొనుగోళ్ళను ఆపమని చెబుతున్నామని చెప్పారు. పుతిన్ నుంచి తాను కోరుకునేది ఒక్కటే..యుద్ధాన్ని ఆపాలి, ఉక్రేనియన్లను చంపడం ఆపాలి..అలాగే రష్యన్లను కూడా చచ్చిపోకుండా కాపాడండి. వారంలో ఆగాల్సి యుద్ధం నాలుగు ఏళ్ళుగా సాగుతోంది. ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పడాలి అని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారతదేశం చమురు కొనుగోలు చేయకపోతే..ఇది చాలా సులభతరం అవుతుంది. 

Also Read: PM to CM: సీఎం చంద్రబాబు హిందీకి ప్రధాని మోదీ ఫిదా...ఎక్స్‌లో పోస్ట్

Advertisment
తాజా కథనాలు