/rtv/media/media_files/2025/10/09/uk-prime-minister-keir-starmer-2025-10-09-11-30-36.jpg)
UK Prime Minister Keir Starmer
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. అయితే కీర్ స్టార్మర్ ముంబైలోని వైఆర్‌ఎఫ్ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో సహా భారతీయ నిర్మాణ సంస్థలు యూకేలోని అన్ని ప్రదేశాలలో సినిమాల్ని చిత్రీకరిస్తాయని వెల్లడించారు. భారత్‌కు స్టార్మర్ రాక వల్ల సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు రానున్నాయి. అయితే వీటితో పాటు ఇంకా భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
Prime Minister @narendramodi welcomes UK Prime Minister @Keir_Starmer to Raj Bhavan in #Mumbai
— PIB India (@PIB_India) October 9, 2025
Watch:⬇️ pic.twitter.com/5fLW790AQe
ఇది కూడా చూడండి: చైనా యువతితో అమెరికా రాయబారి ప్రేమాయణం.. ట్రంప్ షాకింగ్ నిర్ణయం
యూకేలో భారీ భారతీయ సినిమా నిర్మాణం
కీర్ స్టార్మర్ పర్యటన సందర్భంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాల నిర్మాణం ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల కొద్దీ పౌండ్ల పెట్టుబడి లభిస్తుంది. అలాగే యూకేలో 3,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతాయి. దీంతో సినీ రంగానికి అభివృద్ధి జరుగుతుంది.
వాణిజ్య విషయాల్లో లాభాలు
ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే విస్కీ, కార్లు, వైద్య పరికరాలు వంటి ఉత్పత్తులపై భారతదేశం విధించే పన్నులు తగ్గుతాయి. దీని వలన బ్రిటిష్ కంపెనీలకు భారత మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సుమారు రూ.4.5 లక్షల కోట్ల (44.1 బిలియన్ యూరోలు) వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ ఒప్పందం ఒక 'లాంచ్‌ప్యాడ్'గా ఉపయోగపడుతుంది.
ఉద్యోగ కల్పన
స్టార్మర్ తన వెంట 125 మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ బృందాన్ని తీసుకువచ్చారు. వీరు భారతదేశంలో కొత్త పెట్టుబడులు పెట్టే మార్గాలను చూస్తారు. పెట్టుబడులు ఎక్కువగా రావడంతో పాటు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.
సాంకేతికత రంగాలు
ఈ పర్యటన వల్ల వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలు కూడా అభివృద్ధి చెందుతాయి. రక్షణ ఉత్పత్తులను కలిసి తయారు చేయడం, కలిసి అభివృద్ధి చేయడం వంటి అంశాలు వేగవంతం అవుతాయి.
ఇది కూడా చూడండి: Top Universities: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి