/rtv/media/media_files/2025/01/13/jWrGhWZL0LgC7usY0gFc.jpg)
Los Angeles Wildfires
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్‌లో రాజుకున్న కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. అంతకంతకు ఎగిపడుతూనే ఉంది. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల చనిపోయిన వారి సంఖ్య 24కి చేరింది. అమెరికాకు ప్రస్తుతం మంచు తుపాను ప్రభావం ఉండటం వల్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీనివల్ల మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. దీంతో మంటలను ఆర్పేందుకు అదనపు సిబ్బంది కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే లాస్ ఏంజిల్స్‌తో పాటు కాలిఫోర్నియాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న జైళ్ల శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: చైనా, ఇండియా సరిహద్దులో గన్ వాడకూడదు.. ఎందుకంటే?
కార్చిచ్చు మంటలు ఆర్పేందుకు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పంపిస్తున్నారు. అగ్నిమాపక శాఖకు సహకరించే ఖైదీలకు శిక్ష కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందించారు. మంటలు ఆర్పేందుకు ఖైదీలు ఎన్నిరోజులు రోజులు పనిచేస్తారో అందులో ఒక్కో రోజుకి రెండు రోజుల శిక్ష తగ్గిస్తారు. అంటే 2 ఫర్ 1 క్రెడిట్ ఉంటుంది. అలాగే వాళ్లకి జీతం కూడా విడిగా వస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. జైళ్లలో ఉండే ఖైదీలు అగ్నిమాపక శాఖతో కలిసి లాస్ ఏంజిల్స్‌లోని కంటైన్‌మెంట్ లైన్‌ను తవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం 931 మంది ఖైదీలు మంటలు ఆర్పేందుకు 24 గంటలు పనిచేస్తున్నారు. మంటల వ్యాప్తిని ఆపేందుకు శ్రమిస్తున్నారు. ఇక ఖైదీల సామర్థ్యాలను బట్టి వారికి రోజుకు 5.80 డాలర్ల నుంచి 10.24 డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. ఇంకా అత్యవసర సేవలు చేస్తే వారికి గంటకు అదనంగా 1 డాలర్ వస్తుంది.
Also Read: మహా కుంభమేళా.. యూపీకి రూ.2 లక్షల కోట్ల ఆదాయం !
మరోవైపు మంటలను ఆర్పడం పెద్ద సవాలుగా మారిందని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ఆఫ్ కరెక్షన్స్ అండ్ రిహాబిలిటేషన్ సెక్రటరీ జెఫ్ మాకోంబర్ చెప్పారు. ప్రస్తుతం అగ్నిమాపక విభాగాలు పూర్తిగా మంటలు ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా గత కొన్నిరోజులుగా లాస్ ఏంజెల్స్‌లోని పలు ప్రాంతాల్లో కార్చిచ్చు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వేలాది ఇళ్లు మంటల్లో దగ్ధమైపోయాయి. ఇప్పటివరకు దాదాపు 13 లక్షల కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.