Russia Fire Accident : రష్యాలో భారీ పేలుడు..11 మంది స్పాట్‌ డెడ్‌..మరో 130 మంది..

రష్యాలోని షిలోవ్‌స్కీ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. షిలోవ్‌స్కీ జిల్లాలోని ఎలాస్టిక్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 130 మందికి పైగా గాయాల పాలైనట్లు రష్యా అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు.

New Update
fire accident

Russia Fire Accident

Russia Fire Accident : రష్యాలోని షిలోవ్‌స్కీ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. --షిలోవ్‌స్కీ జిల్లాలోని ఎలాస్టిక్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రియాజాన్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 130 మందికి పైగా గాయాల పాలైనట్లు రష్యా అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు.

Also Read : ఆ 9 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

మాస్కోకు 250 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్లాంట్ రష్యా రాజధాని మాస్కోకు ఆగ్నేయ దిశగా షిలోవ్‌స్కీ జిల్లా, రియాజాన్ ప్రాంతంలో ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. -- గన్‌పౌడర్‌ వర్క్ షాపులో పేలుడు సంభవించింది దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి ఎలాస్టిక్ ఫ్యాక్టరీ కాలి బూడిదైంది.

Also Read:"50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్‌ రిప్లై ఇదే..

రష్యన్ వార్తా సంస్థ ఆర్‌ఐఏ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్లాంట్‌లోని గన్ పౌడర్ వర్క్‌షాప్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో అధికారుల దర్యాప్తు చేస్తున్నారు.  డ్రోన్ దాడి మాత్రం కాదని అధికారులు నిర్ధారణకు వచ్చారు.  రష్యా రాజధాని మాస్కోకు 250 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్, అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలోఈ పేలుళ్లు  హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ ప్లాంట్‌లో ఇది రెండో ప్రమాదం. నాలుగేళ్ల క్రితం ఇదే ప్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 

Also Read:ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..

Advertisment
తాజా కథనాలు