ట్రంప్ వార్నింగ్‌ను పట్టించుకోని హమాస్‌.. అది జరగాల్సిందే అంటూ డిమాండ్

హమాస్‌ మరోసారి ట్రంప్‌ వార్నింగ్‌ను పక్కనపెట్టింది. గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Hamas brushes off Trump's threat

Hamas brushes off Trump's threat

హమాస్‌ మరోసారి ట్రంప్ వార్నింగ్‌ను పక్కనపెట్టింది.  గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు గుప్పించింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు యత్నిస్తున్నట్లు హమాస్ ఆరోపించింది. రెండో దశపై చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.  

Also Read: ఒరేయ్ ఇదేం పనిరా.. పెళ్లాం ముందే నిద్రిస్తున్న మరో యువకుడి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.. ఛీ ఛీ!

తాము విడుదల చేస్తోన్న బందీలకు ప్రతీగా పాలస్తీనా ఖైదీలను ఎక్కువగా విడుదల చేయాలని తేల్చిచెప్పింది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేసింది. చర్చలు జరపడమే బందీలను విడిపించుకునేందుకు సరైన మార్గమని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా తాజాగా ట్రంప్‌ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసి విషయం తెలిసిందే. మిగిలిన ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయకుంటే గాజాను మరింత నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.  

Also Read: కోమాలోకి వెళ్లాడంటూ డాక్టర్లు డబ్బు డ్రామా.. ICU నుంచి నడుచుకుంటూ బయటకొచ్చిన పేషెంట్!

హమాస్ తమవద్ద ఉన్న బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని.. మరణించిన వాళ్ల మృతదేహాలను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు అవసరమైన ప్రతిదాన్ని పంపిస్తానని.. నేను చెప్పినట్లు వినకపోతే హమాస్‌కు చెందిన ఓ ఒక్క వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడంటూ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెర నుంచి ఇటీవల విడుదలైన బందీలను కలిశానని.. ఆ సంస్థకు ఇదే చివరి హెచ్చరిక అంటూ తేల్చిచెప్పారు. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురుచూస్తోందని.. హమాస్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలంటూ ఆదేశించారు. 

Also Read:  షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట!

Also Read: పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌కు అమెరికా బిగ్ షాక్.. ప్రయాణాలు నిషేధం !

Advertisment
తాజా కథనాలు