/rtv/media/media_files/2026/03/04/gulf-2026-03-04-12-28-38.jpg)
gulf Countries intercepted Iran missiles, drones
ఇరాన్‌పై అమెరికా(us iran war), ఇజ్రాయెల్(israel) కలిసి చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లోని అమెరికా(america) స్థావరాలపై ఇరాన్ దాడులు ప్రారంభించింది. అలాగే ఎయిర్‌పోర్టులు, హోటల్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఖతార్, సౌదీ అరేబియాలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై మిసైళ్లతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ చేసిన దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గల్ఫ్ దేశాలు చెబుతున్నాయి.
Also Read: ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా
Gulf Countries Intercepted Iran Missiles
తాము 178 బాలిస్టిక్ మిస్సైల్స్, 384 డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 182 మిసైల్స్‌ను గుర్తించి అందులో 169 క్షిపణులను కూల్చినట్లు పేర్కొంది. మిగతావి సముద్రంలో పడ్డట్లు తెలిపింది. బహ్రాయిన్ 70 క్షిపణులు, 76 డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. ఇక ఖతార్ తాము 104 మిసైల్స్‌ను గుర్తించి 101 క్షిపణులను కూల్చినట్లు వెల్లడించింది. అలాగే తమపైకి 39 డ్రోన్లు రాగా.. వాటిలో 24 డ్రోన్లను కూల్చామని చెప్పింది. అంతేకాదు ఇరాన్‌కు చెందిన రెండు SU-24 బాంబర్లను కూడా అడ్డుకున్నట్లు పేర్కొంది. సౌదీ అరేబియా దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటపెట్టలేదు. కానీ రియాద్, అల్ ఖర్జ్ సమీపంలో 8 డ్రోన్లను నేలకూల్చినట్లు వెల్లడించింది.
Also Read: అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ .. అట్రిషన్ యుద్ధంలోకి ఇరాన్
Follow Us