/rtv/media/media_files/2024/12/29/YnGUPNVFd3lIWxUIIwrA.jpg)
mouni Amavasya 2025
Mauni Amavasya 2025: హిందూమతంలో మౌని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ ఏడాది మౌని అమావాస్యకు మరింత ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 29 బుధవారం రోజున వచ్చింది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది మౌని అమావాస్యనాడు మూడు గ్రహాల ప్రత్యేక కలయిక ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, బుధుడు మకర రాశిలో కలిస్ వస్తారు. ఈ మూడు గ్రహాల కలయిక త్రిగాహి యోగ కలయికను సృష్టిస్తుంది. త్రిగాహి యోగ కలయిక నాలుగు రాశుల వారికి శుభఫలితాలను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
నాలుగు రాశులకు ప్రయోజనకరం
కన్యా రాశి
త్రిగ్రాహి యోగం కన్య రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. వృత్తి జీవితంలో పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది.
ప్రేమ, వ్యాపార జీవితం కూడా మెరుగుపడుతుంది. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తులా రాశి
మౌని అమావాస్య రోజున మూడు గ్రహాల కలయిక తులా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులతో సంబంధాలు మరింత పెరుగుతాయి. వ్యాపార పరిస్థితులు ముందు కంటే మెరుగ్గా ఉంటాయి.
వృషభ రాశి
మౌని అమావాస్య నాడు మూడు గ్రహాల కలయిక వృషభ రాశి వారికి శుభఫలితాలను కలిగిస్తుంది. జీవితంలో ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఉద్యోగ జీవితంలో పురోగతో ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి బలపడుతుంది.
మకర రాశి
మౌని అమావాస్య రోజున మకర రాశివారికి శుభ గడియలు సూచిస్తున్నాయి. భూమి, వాహనం, లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉంది. ఆర్ధిక పరమైన సమస్యలు పరిష్కారమవుతాయి.
మౌని అమావాస్య ప్రాముఖ్యత
హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున పుణ్య నదుల్లో స్నానం ఆచరించడం ద్వారా పాపలు తొలగిపోతాయని నమ్మకం. అయితే ప్రయాగ్ రాజ్ మహా కుంభ్ లో మౌని అమావాస్య రోజున మూడో అమృత స్నానం జరగనుంది. ఆ రోజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడం మరింత శుభ ఫలితాలను అందిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!