/rtv/media/media_files/2025/01/14/DnZXQYqehx3AjbXwtusT.jpg)
TIK TOK, Elon Musk
టిక్ టాక్...ఒకప్పుడు ఈ యాప్ వాడని వాళ్ళు ఉండేవారు కాదు. అసలు సోషల్ మీడియా, రీల్స్ మీద క్రేజ్ పెంచినదే ఈయాప్. కానీ చైనా వాళ్ళు తయారు చేసిన టిక్ టాక్ ను భారత్‌తో సహా చాలా దేశాలు బ్యాన్ చేశాయి. అమెరికాలో కూడా చాలా రాష్ట్రాలు ఈ యాప్ ను నిషేధించాయి. దీని ద్వారా ఇతర దేశాల ముఖ్య సమాచారాలను చైనా సేకరిస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ఎక్స్ బాస్ అయిన ఎలాన్ మస్క్‌కు అమ్మేయాలనే ఆలోచన చేస్తోంది చైనా. దీని వెనుక కూడా రీజన్ ఉంది.
నిషేధించాలా...అమ్ముతారా..
షార్ట్ వీడియోలకు, రీల్స్‌కు ఫైమస్ అయిన టిక్ టాక్ ఇప్పుడు అమెరికా వ్యాప్తం బ్యాన్‌ను ఎదుర్కొనే ముప్పు ఉంది. ఇప్పటికే అక్కడ చాలా రాష్ట్రాల్లో టిక్టాక్‌ను నిషేధించారు. ఇప్పుడు దీన్ని పూర్తిగా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది అమెరికా. దీనికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో ఓ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు చైనా యాజమాన్యం టిక్ టాక్‌ను వదులుకోకపోతే పూర్తిగా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read: Cricket: కెప్టెన్సీ రేసులో జైశ్వాల్...కోచ్ గంభీర్ మద్దతు
ఈ బిల్లును, నిషేధాన్ని తప్పించుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే టిక్‌టాక్‌ను ఎలాన్ మస్క్‌కు అమ్మాలని చూస్తోంది. దీనికి సంబంధించి చైనీస్ అధికారిక వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ న్యూస్ కథనం ప్రచురించింది. టిక్‌టాక్ ను తన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నియంత్రణలో ఉంచాలనే చైనా అనుకుంటోంది. అయితే ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఏం చేయాలా అన్న దానిపై చైనా ఆలోచిస్తోంది. వాళ్ళకు ఇప్పుడు అందుబాటులో ఉన్న అవకాశం ఎలాన్ మస్క్‌కు టిక్ టాక్‌ను అమ్మడం.
దీనిపై అమెరికా సుప్రీంకోర్టు కూడా చైనా కంపెనీ బైట్ డ్యాన్స్ కు డెడ్‌లైన్ ఇచ్చింది. జనవరి 19లోగా టిక్‌టాక్‌ను అమ్మాలి లేదా దాన్ని అమెరికాలో పూర్తిగా నిషేధస్తామని చెప్పింది. దీనిపై చైనా కంపెనీ అప్పీల్ చేసుకుంది. కానీ అక్కడ జడ్జిలు అమెరికా వైపే మొగ్గు చూపుతారని తెలుస్తోంది. మరోవైపు జనవరి 20 తర్వాత ట్రంప్ అధికారంలోకి వస్తారు. అప్పటి నుంచి చైనా మీద మరిన్ని ఆంక్షలు ఎక్కువవుతాయి. ఈ నేపథ్యంలో చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకే టిక్‌టాక్‌ను ట్రంప్‌కు సన్నిహితుడైన ఎలాన్ మస్క్‌కు అమ్మాలని అనుకుంటోంది.
Also Read: HYD: హరీశ్‌రావు గృహ నిర్భంధం..భారీగా పోలీసులు