/rtv/media/media_files/2025/09/12/former-brazil-leader-jair-bolsonaro-sentenced-to-27-years-in-prison-for-plotting-coup-2025-09-12-10-54-14.jpg)
Former Brazil leader Jair Bolsonaro sentenced to 27 years in prison for plotting coup
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకి బిగ్ షాక్ తగిలింది. సైనిక కుట్ర కేసులో ఆయనకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 ఏళ్ల 3 నెలల జైలుశిక్ష విధించింది. 2022 ఎన్నికల్లో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో బోల్సొనా ఓడిపోయారు. అయినాకూడా అధికారాన్ని దక్కించుకునేందుకు ఆయన సైనిక కుట్రకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ ఈ జైలుశిక్ష విధించింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన కేసులో జైలుశిక్ష పడ్డ మొదటి మాజీ అధ్యక్షుడిగా బోల్సొనారో నిలవడం గమనార్హం.
The same judge who gave Musk and Twitter (now X) a hard time, just sentenced #Bolsonaro to 27 years prison (for attempting a coup after he lost the elections). #BRAZILhttps://t.co/e5LtavIVXl
— Lars Pellinat (@Lars9596) September 11, 2025
Also Read: అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2022 ఎన్నికల్లో బోల్సొనారో ఓడిపోయారు. దీంతో ఆయన మద్దతుదారులు రాజధాని బ్రసీలియాలో అలర్లకు పాల్పడ్డారు. చివరికి దేశ అధ్యక్షుడి అధికారిక నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంటు భవనాల్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. లూలా డా సిల్వా గద్దె దింపాలంటూ నినాదాలు చేశారు. బోల్సోనారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం చర్యలు తీసుకోవాలంటూ డిమాండే చేశారు. అంతేకాదు బోల్సోనారో కూడా తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ''అధికారం మీ చేతుల్లో ఉంది. సైన్యం నా మాట వింటుంది. దొంగల పాలనను కూల్చేయండంటూ'' పిలుపునిచ్చారు.
Also Read: చార్లీ కిర్క్ ను చంపింది కాలేజీ యువకుడే..ఆధారాలు దొరికాయంటున్న ఎఫ్బీఐ
లూలా డిసిల్వా ఎన్నికల్లో ప్రజల ఓట్ల వల్ల గెలవలేదని.. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వల్లే గెలిచాడంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. దీంతో ప్రాసిక్యూటర్ జనరల్ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు బోల్సోనారోతో సహా మరో 33 మందిపై విచారణకు పర్మిషన్ ఇచ్చింది. చివరికి బోల్సోనారో సైనిక కుట్రకు పాల్పడ్డట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆయనకు 27 ఏళ్ల 3 నెలల జైలుశిక్ష విధించింది. మరోవైపు ఆయన మిత్రుడైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ తీర్పును తీవ్రంగా ఖండించారు.
Also Read: నేపాల్ రాజకీయాల్లో తొలగని అనిశ్చితి..ఎటూ తేల్చుకోలేకపోతున్న జెన్ జీ
ఇటీవల ట్రంప్ బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. జైర్ బోల్సోనారోపై అక్కడ జరుగుతున్న న్యాయ విచారణను ట్రంప్ వ్యతిరేకించారు. దాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ దేశంపై 50 శాతం టారీఫ్‌లు విధించారు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ట్రంప్ టారిఫ్‌లను ఖండించింది. లాలూ ద సిల్వా కూడా ఈ టారిఫ్‌ను '' టారిఫ్ బ్లాక్‌మెయిల్'' అంటూ ధ్వజమెత్తారు. తమ దేశంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని విమర్శించారు.