/rtv/media/media_files/2025/09/11/charlie-2025-09-11-20-36-33.jpg)
ఉటావ్యాలీ యూనివర్శిటీలో దాదాపు 3 వేలమంది విద్యార్థులు, ప్రేక్షకుల మధ్యలో ప్రూవ్ మీ రాంగ్ అనే బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతున్న ట్రంప్ సన్నిహితుడు చార్లీకిర్క్ ను హత్య ను చేశారు. తుపాకీతో అతని మెడ మీద కాల్చారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చార్లీ చనిపోయారు. దీంతో అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టింది. కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.
ఆధారాలు దొరికాయి..తొందరలోనే పట్టుకుంటాం..
నిందితుడిని పట్టుకోవడానికి ఎఫ్బీఐ చాలా వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఎక్కడ నుంచి షూట్ చేశాడో ఆ ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. షూటర్ ఉన్న ప్రాంతంలో నిందితునికి సంబంధించిన ఫుట్ వేర్ ప్రింట్, అతని చేతి ముద్రలు దొరికాయని తెలిపింది. దాంతో పాటూ నిందితుడు వాడిన గన్ ఆధారాలు కూడా లభించాయని చెప్పింది. షూటర్ కాలేజీ విద్యార్థి వయసు గల వ్యక్తని ఎఫ్బీఐ తేల్చింది. అతను చార్లీ ని చంపడానికి హై-పవర్డ్బోల్డ్ యాక్షన్ రైఫిల్ వాడాడని తెలిపింది. కాల్పులు జరిపిన తర్వాత ఆ గన్ ను నిందితుడు అక్కడే వదిలేయడంతో ఎఫ్బీఐ దానిని స్వాధీనం చేసుకుంది. దొరికిన ఆధారాల బట్టి షూటర్ ను తొందరలోనే పట్టుకుంటామని చెప్పింది. హంతకుడికి సంబంధించిన వీడియో కూడా దొరికిందని చెబుతోంది. అయితే అతని ఆధారాలను, వీడియోను ఇప్పుడే బయటపెట్టమని..అచూకీ కనిపెట్టిన తర్వాతనే విడుదల చేస్తామని ఎఫ్బీఐ తెలిపింది. నిందితుడు పారిపోకుండా ఉండడానికి, మరిన్ని దాడులు చేయకుండా ఉండడానికే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎఫ్బీఐ తెలిపింది. అంతకు ముందు కాల్పులకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ విచారణలో వారికి ఈ సంఘటనతో ఎటువంటి సంబంధం లేదని తేలింది.
🚨 BREAKING: The FBI has recovered a "high powered BOLT ACTION RIFLE" in a wooded area where the assassin fled after kiIIing Charlie Kirk
— Nick Sortor (@nicksortor) September 11, 2025
The suspect is believed to be "college-aged"
"Investigators have collected footwear impression, a palmprint and forearm imprints for… pic.twitter.com/zodDSiY1xS
ఇక చార్లీ కిర్క్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దేశ అత్యున్నత పౌర పురస్కారం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ప్రకటించారు. కిర్క్ మృతి పట్ల ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, చార్లీ కిర్క్ ఈ తరానికి ఓ గొప్ప వ్యక్తి అని, ఓ అసాధారణమైన పోరాట యోధుడని, లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాడని కొనియాడారు. "చార్లీ గొంతుక, అతను ఎంతో మంది, ముఖ్యంగా యువత హృదయాల్లో నింపిన ధైర్యం కలకాలం నిలిచిపోతాయని నాకు నమ్మకం ఉంది" అని ట్రంప్ తెలిపారు.