/rtv/media/media_files/2025/12/15/father-and-son-behind-bondi-jewish-festival-shooting-that-killed-15-in-australia-2025-12-15-15-01-39.jpg)
Father and son behind Bondi Jewish festival shooting that killed 15 in Australia
ఆస్ట్రేలియా(australia) లోని సిడ్నీ(Sidney) లో బాండిబీచ్‌లో జరిగిన కాల్పులు(Australia Shooting) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 16 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన తండ్రి, కొడుకు ఉన్నట్లు తేలింది. అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హనుక్కా వేడుకలో యూదులు టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. దీంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. చివరికి పోలీసుల ఎదురు కాల్పుల్లో తండ్రి మరణించాడు. గాయాలపాలైన అతడి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
Also Read: నేటి నుంచే హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..
ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. దుండగులు వాడిన ఆయుధాల గురించి కీలక వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి దగ్గర్లో రెండు IEDలు కూడా దొరికినట్లు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడ్డ 50 ఏళ్ల తండ్రి తుపాకీ హోల్టర్ అని గుర్తించారు. అతడి పేరు మీదు ఆరు తుపాకులు నమోదు చేశారని.. ఈ నేరాలకు కూడా అవే ఆరు తుపాకులు ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడులకు చేయడానికి గల కారణం ఏంటి ? వీళ్లని ఎవరు ప్రేరేపించారనే దానిపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ISISకి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read: కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP
గాజాపై యుద్ధమే కారణమా ?
ఈ కాల్పులు యూదులను టార్గెట్ చేసుకొని జరిగాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. దీంతో యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియాలో యూదుల సంఘంపై దాడులు పెరిగాయని, యూదు వ్యతిరేకత పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌లో యూదులు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలసిందే. వాళ్లని వ్యతిరేకిస్తూ ఇలాంటి దాడులు పలుచోట్ల జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Follow Us