/rtv/media/media_files/2025/01/16/j07BaNdarJNl5BkKIjJy.jpg)
aI TOOLS Photograph: (aI TOOLS)
ప్రస్తుతం ప్రపంచాన్ని ఏఐ శాసిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఏఐ వల్ల ఎన్నో రంగాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో అయితే లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఆంథ్రోపిక్ ఏఐ వచ్చినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ రంగంలో ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని ఆందోళన చెందక్కర్లేదని గూగుల్, ఎన్‌విడియా వంటి దిగ్గజ సంస్థల అధినేతలు భరోసా ఇస్తున్నారు. చివరకు ఆంథ్రోపిక్ కూడా ఈ ఏఐ టూల్స్ వల్ల సాఫ్ట్‌వేర్ రంగానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చిప్ తయారీ దిగ్గజం ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హాంగ్ ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ నిపుణులకు ముప్పు అనే వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. ఏఐ అనేది ప్రస్తుత సాఫ్ట్‌వేర్ ఆధారంగానే పనిచేస్తుందని.. అది ఉన్న టూల్స్‌ను సమర్థంగా వాడుకుంటుందే తప్ప కొత్తవాటిని కనిపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని..
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఏఐ వల్ల నిపుణుల ఉత్పాదకత పెరుగుతుందని.. ఒకే తరహా పనులను మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేషన్ సహాయపడుతుందని ఆయన వివరించారు. గత 20 ఏళ్లుగా టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే వాదనలు ఉన్నప్పటికీ.. ఏటా కొత్త ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయని పిచాయ్ గుర్తు చేశారు. గూగుల్‌లో ఇప్పటికే 30% కోడ్ ఏఐ ద్వారానే జరుగుతోందని.. దీనివల్ల కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ వేగవంతమై మరింత మంది ఉద్యోగుల అవసరం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ప్రస్తుత ఆందోళనకు కారణమైన ఆంథ్రోపిక్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు డేనియల అమోడెయ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఏఐ వల్ల కోడింగ్‌కు ప్రాధాన్యత తగ్గొచ్చు కానీ.. ఉద్యోగులకు కాదని ఆమె స్పష్టం చేశారు. ఏఐ కంపెనీలు ఇప్పుడు కేవలం టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్నవారి కంటే చక్కని కమ్యూనికేషన్, కల్పనాశక్తి, కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆమె తెలిపారు. భావోద్వేగాలను అర్థం చేసుకునే వారు, సానుకూల దృక్పథం ఉన్నవారి అవసరం ఏఐ రంగంలో ఎక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us