Elon Musk: నాటో, ఐరాస నుంచి అమెరికా వెళ్లిపోవాలి: ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. నాటో, ఐక్యరాజ్యరాజ్య సమితి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏమాత్రం సరికాదని అన్నారు.

New Update
Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. నాటో, ఐక్యరాజ్యరాజ్య సమితి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏమాత్రం సరికాదని అన్నారు. ఇప్పటికే నాటో భవిష్యత్తుపై ఆ కూటమిలో ఉన్న దేశాల్లో సందిగ్ధత ఉంది. ఇలాంటి తరుణంలో ఎలాన్ మస్క్‌ చేసిన సూచనలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.    

Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

అయితే గతంలో నాటో దేశాల్లో నిధుల కేటాయింపుపై ట్రంప్ మాట్లాడారు. కూటమిలో నిర్ణయించినట్లుగా అన్ని దేశాలు కూడా తమ రక్షణ వ్యవస్థను బలపేతం చేసుకునేందుకు జీడీపి నుంచి తగినంత నిధులు కేటాయించాలని సూచనలు చేశారు. నాటాలో ఇతర దేశాలు తమ వంతు నిధులను కేటాయించకుంటే తమ రక్షణ దళాలను వెనక్కి తీసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇదిలాఉండగా.. రక్షణ ఖర్చులను భారీగా పెంచాలనే ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్‌ (EU) దేశాలు గతవారం బ్రస్సెల్స్‌లో అత్యవసర శిఖరాగ్ర సమవేశం నిర్వహించారు.  

Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

అయితే తమ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు 800 బిలియన్‌ యూరోలతో ఓ ప్రణాళికను ప్రతిపాదించాయి. రక్షణ కోసం సభ్య దేశాలకు 162.5 బిలియన్‌ డాలర్ల రుణాలు అందించాలనే యూరోపియన్ కమిషన్‌ ప్రతిపాదనపై చర్చలు జరిపాయి. మరోవైపు ఉక్రెయిన్‌ పట్ల అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఐరోపా దేశాల్లో ఆందోళనలు రేపుతోంది. అసలు అమెరికా వ్యూహం ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదని ఈయూ రక్షణ కమిషనర్‌ ఆండ్రియస్ కుబిలియన్ తెలిపారు.  

Also Read: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు

Also Read: పాక్, ఇండియా సరిహద్దులకు వెళ్లొద్దు.. పౌరులకు ట్రంప్ కీలక సూచన!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు