/rtv/media/media_files/2024/12/06/rvG3KkaPQHsJHMG8pbDg.jpg)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన ఆధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్‌ను గెలిపించేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా.. ట్రంప్‌కు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో పాటు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే తాజాగా ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: బీజేపీ పార్టీ మారకుంటే చంపేస్తాం : మావోయిస్టుల వార్నింగ్
ట్రంప్ గెలుపు కోసం మస్క్ ఏకంగా రూ.2 వేల కోట్లు ఖర్చు చేశారు. ఈ మేరకు ఫెడరల్ ఫైలింగ్ ఓ రిపోర్టును విడుదల చేసింది. ఇదిలాఉండగా ట్రంప్ తరఫున పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC) ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కమిటీకి మస్క్.. 239 మిలియన్ డాలర్లు నగదు రూపంలో ఇచ్చారు. మరికొంత ఇతర రూపాల్లో అందించారు. అలాగే ఎన్నికలకు కొన్నివారాల ముందు 25 మిలియన్ డాలర్లున్న 3 చెక్కులు కూడా ఇచ్చారు.
అంతేకాదు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్బర్గ్ పేరు మీద కూడా 20 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అలాగే పలువురు రిపబ్లికన్ అభ్యర్థులకు కూడా 12 మిలియన్ డాలర్లు అందించినట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు ఓటర్లను ట్రంప్ వైపు తిప్పేందుకు వాక్ స్వాతంత్ర్యం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసిన ఓటర్లకు కూడా మస్క్ డబ్బులు పంపించినట్లు వార్తలు వచ్చాయి.
Also Read: నేను అడిగితేనే షిండే అలా చేశారు.. ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు
అయితే ట్రంప్.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తానని కూడా చెప్పడం చర్చనీయాంశమైంది. చివరికీ ట్రంప్ అన్నట్లుగానే మాట ప్రకారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతలను మస్క్‌కు అప్పగించారు. అయితే అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు చేయడమే డోజ్ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు చెప్పారు.