/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్...ప్రపంచం అంతా దీనిపైనే నడుస్తోంది ఇప్పుడు. అందుకే ఏ విషయంలో కలవని గూగుల్, ఆపిల్ టెక్నాలజీలు కూడా ఏఐ విషయంలో చేతులు కలిపాయి. దీనికి సంబంధించి కీలక ఒప్పందాన్ని చేసుకున్నాయి. యాపిల్ అభివృద్ధి చేస్తున్న ‘ఫౌండేషన్ మోడల్స్’ (యాపిల్ ఇంటెలిజెన్స్) ఇకపై గూగుల్ జెమినై ఏఐ మోడల్స్‌తో పనిచేయనున్నాయి. ఇందుకు గూగుల్ క్లౌడ్ టెక్నాలజీని యాపిల్ వినియోగించుకోనుంది. దీనిపై దీర్థ కాలిక ఒప్పందాన్ని చేసుకున్నాయి టెక్ దిగ్గజాలు. ఈ ఒప్పందం ప్రకారం.. యాపిల్ మోడళ్లు జెమినై మోడళ్లు, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. దీనివల్ల యాపిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిరి మరింత షార్ప గా పని చేయనుంది. అయితే ఎప్పటిలానే యాపిల్ సీక్రెసీ మాత్రం మెయిటెయిన్ వుతుంది. డేటాను గూగుల్ కు ప్రాసెసింగ్ ఇవ్వరు . ప్రాసెసింగ్ మొత్తం యాపిల్ క్లౌడ్, డివైజ్ లలోనే జరుగుతుంది.
ఇది అన్యాయం అంటున్న ఎలాన్ మస్క్..
గూగుల్, యాపిల్ కొత్త డీల్ పై మరో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన టెక్ రంగంలో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్ మరింత గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆండ్రాయిడ్, క్రోమ్ ద్వారా గూగుల్ ను ఎవరూ బీట్ చేయలేక పోతున్నారు. ఇప్పుడు దీనికి యాపిల్ సిరి కూడా కలిస్తే..దానిని ఎవరూ ఆపలేరని మస్క్ చెబుతున్నారు. ఇది తమ ఎక్స్, గ్రోక్ కు కూడా పెద్ద దెబ్బ అవుతుందని అంటున్నారు.. సిరి, ఇతర యాపిల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో చాట్‌జీపీటీని ఆప్షనల్ ఫీచర్‌గా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. యాపిల్ ఇంతకు ముందు కూడా ఓపెన్ ఏఐతో కలిసి పని చేసింది. ఇప్పుడు గూగుల్ తో చేస్తోంది. దీని వలన మిగతా వారికి అవరోధం ఏర్పడుతోంది. యాపిల్ సంస్థ విధానాలు ప్రత్యర్థులను కిందకు తొక్కేస్తున్నాయి అంటూ ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. దీనిపై దావా కూడా వేశారు. ఈ భాగస్వామ్యం కేవలం సాంకేతికతకు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదని, భవిష్యత్ AI పర్యావరణ వ్యవస్థపై నియంత్రణ కోసం జరిగే యుద్ధం అని కూడా మస్క్ చెబుతున్నారు.
అయితే ఏఐ విషయంలో విమర్శలను ఎదుర్కొంటున్న యాపిల్ కు మాత్రం గూగుల్ తో ఒప్పందం కలిసి వస్తుంది. జనరేటివ్ ఏఐలో మిగతా వారి కంటే యాపిల్ వెనుకబడి ఉంది. అలాగే సెర్చ్ ఇంజిన్, డిజిటల్ ప్రకటనలు, బ్రౌజర్ మార్కెట్ల లలో ఆధిపత్యానికి సంబంధించి గూగుల్ కూడా యాంటీ ట్రస్ట్ కేసులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ రెండు సంస్థ ఒప్పందంతో ఇవన్నీ సెట్ అవ్వనున్నాయి. గూగుల్, యాపిల్ రెండిటిలోనూ ఫీచర్లు మెరుగుపడతాయని చెబుతున్నారు.
Also Read: Trump Tariffs: టార్గెట్ ఇరాన్...భారత్ పై భారీ ఎఫెక్ట్..75 శాతం తప్పవేమో
Follow Us