/rtv/media/media_files/2026/01/13/iran-india-2026-01-13-16-42-10.jpg)
రష్యాతో వ్యాపారం కారణంగా ఇప్పటికే భారత్ 50 శాతం సుంకాలను ఎదుర్కొంటోంది. అమెరికా మన దేశంపై మామూలుగా 25 శాతం సుంకాలను విధించింది. దానికి తోడు రష్యా దగ్గర చమురు కొంటున్న కారణంగా మరో 25 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో ఒకటైన భారత్ కూడా దీనికి బలి అవనుందని తెలుస్తోంది.
ఇరాన్, భారత్ మధ్య స్ట్రాంగ్ వాణిజ్యం..
గత ఏడాది గణాలంకాల ప్రకారం...మన దేశం ఇరాన్ కు 1. 24 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అలాగే అక్కడ నుంచి 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి కూడా చేసుకుంది. అంటే దాదాపుగా ఇరు దేశాల మధ్యనా 1.68 బిలయన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇండియన్ కరెన్సీలో రూ.15 వేల కోట్లకు పైమాటే. భారత్ నుంచి ప్రధానంగా బియ్యం, తేయాకు, చక్కెర, ఫార్మా, ఆర్గానిక్ రసాయనాలు వంటివి ఇరాన్‌కు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా సేంద్రియ రసాయనాల ఎగుమతుల విలువ 512.92 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక, టెహ్రాన్ నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తులు, ప్లాస్టిక్, పండ్లు, నట్స్ వంటి వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశానికి వచ్చే నట్స్ చాలామట్టుకు ఇరాన్ నుంచే వస్తాయి. దీని విలువ 311.60 బిలియన్ డాలర్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ నిర్ణయం ..భారత్ పై ఎఫెక్ట్..
ఇప్పుడు తాజాగా ఇరాన్ తో వ్యాపారం చేస్తే 25 శాతం సుంకాలు చెల్లించాల్సిందే అంటూ ట్రంప్ ప్రకటన జారీ చేశారు. ఇది మన దేశంపై భారీగానే ఎఫెక్ట్ చూపించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాణిజ్య పరంగానే కాదు భారత వ్యూహాత్మక ప్రయోజనాలపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. భారత ప్రాంతీయ అనుసంధాన ప్రణాళికలు, సరఫరా గొలుసుకు ఇరాన్‌తో కలిసి చేపడుతోన్న చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ అత్యంత కీలకం. ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఈ ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడుతుంది. అసలు మొత్తం అన్నీ లెక్కలు వేసుకుంటే భారత్ 75 శాతం సుంకాలను కట్టవలసి వస్తుందని తెలుస్తోంది. ఇది మన దేశంలో పలు రంగాలను తీవ్రంగా ప్రభావం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటూ గత కొన్ని నెలలుగా ఇండియా, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపైనా ఈ సుంకాలు ప్రభావం చూపిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ట్రంప్ టారీఫ్ లపై అమెరికా సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. దాని తర్వాతనే వాటికి చట్టబద్ధత వస్తుంది. లేదు ఒక వేళ కోర్టుల తీర్పు ట్రంప్ కు ప్రతికూలంగా కనుక వస్తూ అమెరికా వందల బిలియన్ డాలర్‌లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
Follow Us