/rtv/media/media_files/2025/04/28/hMsYA2Sax2llBQ4FKkFo.jpg)
audi-car
Haryana: గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. వెంటనే HDFC బ్యాంకులో మంచి జీతంతో ఉద్యోగంలో చేరాడు. 7 సంవత్సరాలు మేనేజర్‌గా కూడా పనిచేశాడు. కానీ సంతృప్తి లేదు. దీంతో జాబ్ వదిలేసి ఇప్పుడు ఆడి కారులో ఇంటింటికి పాలు అమ్ముతున్నాడు. ఇంతకీ ఎవరీతను.. ఏంటీ స్టోరీ తెలుసుకుందాం. ఈ యువకుడి పేరు అమిత్ భదాన.. ఫరీదాబాద్‌లోని మొహబ్బతాబాద్ గ్రామానికి చెందిన ఇతను తన బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని లగ్జరీ కారులో(Audi car ) ఇంటింటికి పాలు(milk) పోయడం ద్వారా స్థానికంగా సంచలనంగా మారాడు.
Also Read: వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
చిన్నప్పటి నుంచి పాల వ్యాపారం
అమిత్ భదాన కుటుంబం చిన్నప్పటి నుంచి పాల వ్యాపారం చేస్తుంది. బాగానే చదువుకున్న అమిత్ భదాన.. HDFC బ్యాంకులో జాబ్ సంపాదించాడు. అతనికి కార్లు,బైక్ లంటే చాలా ఇష్టం. కానీ కార్పొరేట్ ప్రపంచం వలన తన అభిరుచులను వదులుకోవడం తనను బాధపెట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో అతను తన జాబ్ ను వదిలేశాడు. ఇప్పటికే తన కుటుంబం పాల వ్యాపారంలో స్థిరపడటంతో తాను కూడా అదే రంగంలోకి దిగి తనకు ఇష్టమైన బైక్, కార్లలో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ పాలు పోస్తున్నాడు. ఇది తనకు చాలా సంతృప్తిని ఇస్తుందని అమిత్ చెబుతున్నాడు.
Also Read : ఏ ముఖం పెట్టుకుని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా అడగాలి.. ఒమర్ అబ్దుల్లా ఎమోషనల్ స్పీచ్!
Also Read: భారత్, పాక్ మధ్య అణు యుద్ధం.. ఎవరి బలం ఎంత?
అమిత్ వ్యాపారం కూడా వేగంగానేల అభివృద్ధి చెందింది. అమిత్ భదానా తన కస్టమర్లకు ముందుగా రూ. 30ల క్షల బైక్ పైన ఇంటింటికి తిరుగుతూ పాలు పోయగా ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల విలువైన ఆడి కారులో తిరుగుతూ పాలు పోస్తుండటం విశేషం. తన అభిరుచిని, వ్యాపారంతో కలిపి కొనసాగించడంలో తన కుటుంబం అందించిన సహకారం గొప్పదని అమిత్ తెలిపాడు. వారు తనను చూసి గర్వపడుతున్నారని అన్నాడు. ఇప్పుడు అమిత్ ఒక సెలబ్రిటీ కంటే తక్కువేమీ కాదు. అతని కస్టమర్లు అతను రాకముందే తలుపు వద్ద నిలబడి ఆడి కారు ముందు అతనితో సెల్ఫీలు అడిగి మరి తీసుకుంటారు. అమిత్ ప్రతిరోజూ దాదాపు 120 లీటర్ల పాలు అమ్ముతాడు. అతని గోశాలలో 32 ఆవులు, 6 గేదెలు ఉన్నాయి. అమిత్ కు పెళ్లి కాగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Also Read: ఇండియాతో యుద్ధం వద్దు.. పాక్ మాజీ ప్రధాని కీలక సూచనలు