Canada: కెనడాలో విజయం దిశగా లిబరల్స్..ముందంజలో మార్క్ కార్నీ

కెనడాలో లిబరల్ పార్టీ దూసుకుపోతోంది. మార్క్ కార్నీ నేతృత్వంలో ఆ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఆయనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ కూడా గట్టి పోటీనే ఇస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
Canada PM Mark Carney

Canada PM Mark Carney

ఎంతో ఆసక్తి రేపిన కెనడా పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక్కడ మళ్ళీ అధికారంలోకి లిబరల్ పార్టీనే వస్తుంది అని అంటున్నారు. ట్రూడో రాజీనామా తర్వాత కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు అంతా. కానీ అందుకు విరుద్ధంగా మళ్ళీ లిబరల్ పార్టే ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో మార్క్ కార్నీ ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాపై ప్రకటించిన వాణిజ్య యుద్ధం, ఆక్రమణలు...ట్రూడో ముందుగానే రాజీనామా చేయాల్సి రావడం, అలాగే భారత్ తో దౌత్య విభేదాలు వీటన్నింటి మధ్యనా కెనడా ఎన్నికలు ఈసారి బాగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

ఆధిక్యంలో లిబరల్ పార్టీ.. 

కెనడా పార్లమెంటులోనో హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం 343 సీట్లు ఉంటాయి. ఇందులో 172 లో వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు అవుతుంది. ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు చూస్తే.. లిబరల్‌ పార్టీ 59 స్థానాల్లో గెలుపొందగా.. మరో 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే కన్జర్వేటివ్‌ పార్టీ కూడా 56 స్థానాలు దక్కించుకొని.. మరో 76 చోట్ల ఆధిక్యంలో ఉంది.  ఖలిస్థానీ అనుకూలుడైన జగ్మీత్‌ సింగ్‌ న్యూ డెమోక్రటిక్‌ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఎన్నకలకు ముందే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇమ్మిడియేట్గా లిబర్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ఆయన వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికలు జరగడం, ఓట్ల లెక్కింపు అన్నీ ఒక్కరోజులోనే జరిగిపోతున్నాయి. 

today-latest-news-in-telugu | canada | elections

Also Read: UN: అదొక రోగ్..ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భారత్ మండిపాటు

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Advertisment