/rtv/media/media_files/2026/03/07/f7197d22-cc69-40e9-bbe7-ca6fec88d1ec-2026-03-07-14-42-21.jpg)
ఇరాన్-ఇజ్రాయెల్ వార్(iran israel war) రోజురోజుకు ముదురుతోంది. అయితే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ భీకర దాడి చేసింది. మిస్సైల్స్‌ను ఇరాన్ నేరుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ప్రయోగించడంతో భారీగా పేలుళ్లు సంభవించాయి. ఈ దాడి ధాటికి విమానాశ్రయంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. క్షిపణులు పడిన చోట పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఎయిర్‌పోర్ట్ మొత్తం పొగతో నిండిపోయింది. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలియక సిబ్బంది, ప్రయాణికులు ఆందోళన చెందారు.
ఇది కూడా చూడండి: Strait of Hormuz : నీకు ధైర్యం, దమ్ము ఉంటే.. ట్రంప్ కు ఇరాన్ సంచలన సవాల్!
Another Iranian attack drone hit Dubai International Airport, barely missing Concourse A. pic.twitter.com/axvNdrXUFn
— OSINTtechnical (@Osinttechnical) March 7, 2026
ఇది కూడా చూడండి: BIG BREAKING: యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఖతార్ సంచలన ప్రకటన
ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని..
భయంతో కొందరు ప్రయాణికులు లగేజీని అక్కడ వదిలేసి పరుగులు పెట్టారు. పరిస్థితులను గమనించిన ఎయిర్‌పోర్టు అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్టును ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఈ దాడి అసత్య ప్రచారం అని, దుబాయ్ ఎయిర్‌పోర్టుపై క్షిపణుల దాడి జరగలేదని అధికారులు చెబుతున్నారు. అనుమానస్పద వస్తువులు గగనతలంలో కనిపించడంతో వైమానిక రక్షణ దళాలు వాటిని గాలిలోనే అడ్డుకుని కూల్చేశాయి. ఇవి విమానాశ్రయం సమీపంలో పడటంతో దాడి చేసినట్లు ప్రచారం జరిగిందని అధికారులు తెలిపారు. ఇది క్షిపణుల దాడి కాదని ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్ట్(Dubai airport) లో విమానాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. - america iran war
ఇది కూడా చూడండి: BIG BREAKING: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ కు సాయం!
An Iranian drone reportedly exploded over Dubai International Airport in the UAE 🇦🇪 just moments ago. pic.twitter.com/lo7EZlz4Fd
— Egypt's Intel Observer (@EGYOSINT) March 7, 2026
ఇది కూడా చూడండి: US-Iran War: ఈ రాత్రికి ఇరాన్ ఖతం.. బిగ్ అటాక్ కు అమెరికా స్కెచ్.. సంచలన కథనాలు!
Follow Us