/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ లీడర్ డొనాల్డ్ ట్రంప్ 312 ఓట్లతో గెలిచారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ వార్షిక వేతనం ఎంతని చాలా మంది సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 400,000 డాలర్లు ఉంటుందట. అంటే ఇది భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ. 2.9 కోట్లు.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
రూ.80 లక్షల ప్రయాణాలు..
ఇదే కాకుండా వీరికి ఇతర సౌకర్యాలు, అలవెన్సులు కూడా లభిస్తాయి. పదవీకాలంలో ఉన్నప్పుడు వైట్ హౌస్‌లో ఉంటారు. అలాగే వ్యక్తిగత విమానం, హెలికాప్టర్ సౌకర్యాలు, పదవీ కాలం తర్వాత పెన్షన్ వంటివి కూడా లభిస్తాయి. ఇతని వేతనంపై అమెరికాలో పన్ను విధిస్తారు. కానీ అలవెన్సులపై పన్ను విధించరు. రూ. 80 లక్షల ప్రయాణాలు, అలాగే రూ. 14 లక్షలు వినోద భత్యంగా కూడా పొందుతారు.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
బోయింగ్ 747 విమాన సౌకర్యం కూడా ఉంది. ఇది 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మెడికల్ ఆపరేటింగ్ రూమ్, ప్రెసిడెంట్ కోసం ఒక సీక్రెట్ గది, అలాగే 100 మంది కూడా ఒక్కసారి కూర్చునే సౌకర్యం ఉన్న గదులు ఉన్నాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడికి వైట్‌హౌస్‌ను 1792లో మొదటిసారిగా ఇచ్చారు. ఈ హౌస్‌లో మొత్తం ఆరు అంతస్తులు,132 గదులు ఉన్నాయి. వీటితో పాటు టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్స్, థియేటర్ అన్ని ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు