/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్పులు చేస్తున్నారు. ఇటీవల అనేక దేశాలపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా ట్రంప్ భారత్ దిగుమతులపై వేసే టారీఫ్‌ల గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఓ రిపోర్టర్ ట్రంప్‌ను ఇండియా దిగుమతులపై 25 శాతం వరకు సుంకం విధిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. అనుకుంటున్నానని తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా అమెరికాకి మిత్రదేశంగా ఉంది.
ఇది కూడా చూడండి: Trump VS Putin: పుతిన్ పది రోజుల్లో కాల్పుల విరమణ చేయాలి, లేకపోతే.. ట్రంప్ సంచలన వార్నింగ్
#WATCH | When asked if India is going to pay high tariffs, between 20-25%, US President Donald Trump says, "Yeah, I think so. India is my friend. They ended the war with Pakistan at my request...The deal with India is not finalised. India has been a good friend, but India has… pic.twitter.com/IYxParZqce
— ANI (@ANI) July 29, 2025
ఇది కూడా చూడండి: USA: భారతీయులపై అక్కసు..వారిని నియమించుకోవద్దన్న ట్రంప్
భారత్‌పై సుంకం..
మిగతా ఏ దేశం కూడా విధించని టారిఫ్‌లు అమెరికాపై భారత్ విధిస్తుందని, అలా చేయకూడదని ట్రంప్ అన్నారు. స్కాట్లాండ్ పర్యటన పూర్తి అయిన తర్వాత వాషింగ్టన్ వెళ్తూ ట్రంప్ టారిఫ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సుంకాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇవి విఫలం అయితే భారత్‌పై కూడా తప్పకుండా 20-25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉందని అన్నారు. అలాగే తన కారణంగానే భారత్-పాక్ ఉద్రిక్తత పరిస్థితులు తగ్గాయని, సుంకాల విషయంలో తన మాట వినాలని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఇది కూడా చూడండి: Thailand-Cambodia: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు
ప్రపంచ దేశాలపై సుంకం..
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధిస్తున్నారు. ఈ టారిఫ్‌లపై ఇప్పటి వరకు మొత్తం ఐదు విడతల్లో చర్చలు జరిగాయి. మొదట్లో ఈ సుంకాలు విధించడానికి ఏప్రిల్ 2వ తేదీ ట్రంప్ డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత జులై 9కి మారగా.. మళ్లీ ఆగస్టు 1వ తేదీకి డెడ్‌లైన్ మారింది. ఈ గడువు పూర్తి కావడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే కొన్ని దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. భారత్, అమెరికా మధ్య ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వచ్చే నెలలో అమెరికా అధికారుల బృందం భారత్‌కు రానుంది. ఆ సమయంలో ఈ సుంకాలపై క్లారిటీ రానుంది. ఇప్పటికే ఇండోనేషియా, యూకే, ఫిలిప్పీన్స్, జపాన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Trump Deal: అగ్రరాజ్యం జాక్ పాట్..జపాన్ తో బిగ్ డీల్