ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం! డోనాల్డ్ ట్రంప్ రాకతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మారినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై హెజ్ బొల్లా రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. మరోవైపు ట్రంప్ గెలుపుతో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది. By srinivas 07 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Donald Trump: డోనాల్డ్ ట్రంప్ రాకతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మారినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ కు అండగా నిలిచిన బైడెన్ ప్రభుత్వం ఓటమిపాలు కావడంతో హెజ్ బొల్లా మరింత రెచ్చిపోతోంది. ఇజ్రాయెల్‌పై హెజ్ బొల్లా రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ విమానాశ్రయంపై రాకెట్ల దాడికి పాల్పడగా.. ఈ దాడిలో బోయింగ్ 777 విమానం పూర్తిగా దెబ్బతిన్నది. సుమారు వంద మంది వరకు సిబ్బంది మృతిచెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యుద్ధం పరిస్థితులతో గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేయగా.. అపార్ట్‌మెంట్లు, జనసాంద్రత ప్రదేశాల్లో హెజ్ బొల్లా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక హెజ్ బొల్లా దాడులను ఇజ్రాయెల్ అధికారంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు హెజ్‌బొల్లా రాకెట్ దాడులు.. ఇక లెబనాన్ బర్జా పట్టణంలో ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడిలో 30 మంది మృతి దుర్మరణం చెందారు. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఉత్తర, మధ్య ప్రాంతంతోపాటు టెల్ అవీవ్ శివార్లలో హెజ్‌బొల్లా రాకెట్ దాడులు చేసింది. ఈ మూడు ప్రాంతాల్లో సైరన్లు మోగించి హెజ్‌బొల్లా 10 రాకెట్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇది కూడా చదవండి: ఎడారి దేశంలో మంచు వర్షం..! భారీగా క్షీణించిన ఇరాన్ కరెన్సీ విలువ.. ఇదిలా ఉంటే.. ట్రంప్ రాకతో ఇరాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది. ఒక డాలర్‌కు 7.03 లక్షల రియాల్స్ స్థాయికి చేరి భారీగా పతనమైంది. ఇక ఇరాన్‌పై ట్రంప్ ఆంక్షలు వందశాతం పెంచుతారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక పరిస్థితులూ మరింత అధ్వానంగా మారుతాయంటున్నారు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికతో తమకు ఒరిగేదేమీ ఉండదని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికార ప్రతినిధి ఫతేమే మొహజెరానీ అంటున్నారు. అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ విధానాలు స్థిరంగానే ఉంటాయని, అధ్యక్షులు మారినంత మాత్రాన అవేమీ పెద్దగా మారవని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: విడాకుల వేళ.. ఐశ్వర్య- అభిషేక్ లతో స్టార్ డైరెక్టర్ మూవీ ప్లానింగ్ Also Read: ''హ్యాపీ బర్త్ డే అప్పా''.. కమల్ కోసం శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్! #trump #israel #hezbollah మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి