LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని స్పష్టం చేసింది. 

New Update
dfede

LMV license: ఎల్ఎంవీ లైసెన్స్ కలిగివున్న డ్రైవర్లకు భారీ ఊరట లభించింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు కూడా ఇకపై కమర్షియల్ వెహికల్ నడపడానికి అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఎల్ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ద్వారా 75 క్వింటాళ్ల బరువుకు మించని రవాణా వాహనాలను నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 5గురు సభ్యుల ధర్మాసనం.. చిన్న వ్యాపారులు, ఆటోలు, క్యాబ్‌లు నడిపేవారు ఎల్‌ఎంవీ లైసెన్స్‌తో 7,500 కిలోల బరువున్న వాణిజ్య వాహనాలను నడిపేందుకు అర్హులేనని తెలిపింది. ఇదే సమయంలో అపాయకరమైన సరకులను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఇది వర్తించదని సూచించింది. 

ఇది కూడా చదవండి: కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ

75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువు..

అలాగే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం బుధవారం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలవరించింది. 2017లో జస్టిస్ యూయూ లలిత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ముకుంద్ దేవాంగన్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కేసులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. 75 క్వింటాళ్ల కంటే తక్కువ బరువున్న ట్రాన్స్ పోర్టు వెహికల్స్ ఎల్ఎంవీల పరిధిలోకే వస్తాయని పేర్కొంది. 

ఇది కూడా చదవండి: Anil Ambani: అనిల్‌ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్‌!

ఇన్సూరెన్స్ కంపెనీల పీటిషన్.. 

ఇదిలాఉంటే.. ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కమర్షియల్ వెహికల్స్ నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ కేసులకు నష్టపరిహారం చెల్లించలేమని ఇన్సూరెన్స్ కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. జస్టిస్ యూయూ లలిత్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 76 పిటిషన్లు వేశాయి. దీంతో సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టి.. ఆగస్టు 21న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం.. ట్రాన్స్ పోర్టు వెహికల్స్ నడుపుతున్న ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలు చేసినట్లు ఆధారలు లేవని  ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ లో సవరణలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది?

Aslo Read: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు