విడాకుల వేళ.. ఐశ్వర్య- అభిషేక్ లతో స్టార్ డైరెక్టర్ మూవీ ప్లానింగ్

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. డైరెక్టర్ మణిరత్నం ఐశ్వర్య, అభిషేక్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.

New Update
aishwarya

Aishwarya- Abhishek

Aishwarya- Abhishek:  గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరు మధ్య విడాకులు తీసుకునే  పరిస్థితి వచ్చిందని  సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమర్స్ పై వీరిద్దరూ కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అంతేకాదు పలు ఈవెంట్లలో కూడా ఐశ్వర్య కేవలం తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కనిపించడం నెటిజన్లలో అనేక అభిప్రాయాలకు దారితీసింది. 

Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

మణిరత్నంతో ఐశ్వర్య- అభిషేక్ 

ఈ క్రమంలో ఐశ్వర్య- అభిషేక్ సంబంధించిన ఓ వార్త  అభిమానులకు ఆనందాన్నిస్తోంది. త్వరలో వీరిద్దరూ ఓ సినిమా కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం  ఐశ్వర్య- అభిషేక్  తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయడానికి సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. గతంలో మణిరత్నం కాంబోలో ఐశ్వర్య- అభిషేక్ ‘తిరువర్‌, గురు, రావణ్‌'  వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 'గురు' చిత్రంలో ఐశ్వర్య, అభిషేక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'పొన్నియన్ సెల్వన్'  సినిమాలో ఐశ్వర్య ఉత్తమ నటనకు ఐఫా అవార్డు లభించింది. 

Also Read: అందుకే నాన్నతో సినిమా చేయలేదు.. అయ్యో! దుల్కర్ ఇలా చెప్పడేంటి..!

ఇది ఇలా ఉంటే ఇటీవలే జరిగిన పారిస్ 'ఫ్యాషన్' వీక్ లో ఐశ్వర్య రాయ్ తమ వెడ్డింగ్ రింగ్‌ ధరించి కనిపించడం విడాకుల రూమర్లకు పరోక్షంగా చెక్ పెట్టింది. అయినప్పటికీ వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విడాకుల ప్రచారం జరుగుతూనే ఉంది. 

Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు