Saudi Arabia: ఎడారి దేశంలో మంచు వర్షం..! కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తగా..తాజాగా ఎడారి దేశంలో భారీ మంచు కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. By Bhavana 07 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Saudi Arebia: గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా అంటేనే ఎడారులకు పెట్టింది పేరు. అక్కడ విపరీతమైన ఎండలు మండుతుంటాయి. అయితే, గత కొంత కాలంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తగా..తాజాగా ఎడారి దేశంలో భారీ మంచు కురుస్తుంది. Also Read: చంద్రబాబు, పవన్, అనిత కీలక భేటీ.. అసలేం జరుగుతోంది? మంచు దుప్పటి.. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. ఇక, సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో కనుచూపు మేర మంచు దుప్పటి కప్పుకుంది. అయితే, ఈ ప్రాంతం ఏడాదంతా పొడి వాతావరణంలో కనిపిస్తుంది. ఎడారులకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వర్షాలు పడటం, మంచు కురవడం ఇక్కడ సాధ్యం కాదు. అలాంటిది చరిత్రలో మొట్టమొదటిసారి ఇక్కడ తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. Also Read: Anil Ambani: అనిల్ అంబానీకి షాక్...మూడేళ్ల పాటు ఆ కంపెనీ బంద్! Capturing the blend of sand and hail, these photos from the Ha'il-Rafha road, taken on Saturday afternoon in 2024. 📸Hamad Al-Saloom. pic.twitter.com/UaGwKmKVQ3 — Najdean Memoirs (@NajdiMemoirs) November 3, 2024 భారీగా మంచు కురుస్తుంది. ఎడారి రోడ్లపై మంచును చూసి స్థానికులు తెగ ఆనందపడుతున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.అయితే, వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పుపై యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం స్పందించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా రాబోయే రోజుల్లో వడగళ్ల వానలు, బలమైన గాలుల, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. Also Read: LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు Snow in Saudi Arabia pic.twitter.com/ZLWHayKztT — Yisrael official 🇮🇱 🎗 (@YisraelOfficial) November 5, 2024 అలాగే, రాబోయే రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది. సుదీర్ఘ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని స్థానికులకు సూచనలు జారీ చేసింది. Also Read: విడాకుల వేళ.. ఐశ్వర్య- అభిషేక్ లతో స్టార్ డైరెక్టర్ మూవీ ప్లానింగ్ 🏝❄️ Saudi Arabian desert covered in snowThis is the first time in history that the desert has been covered in snow, as temperatures there rarely drop to such levels.A severe hail storm also raged there recently. pic.twitter.com/4wjSaaRMfo — Nurlan Mededov (@mededov_nurlan) November 3, 2024 #United Arab Emirates #saudi-arabia #snowfall #Al Jawf మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి