Iphones: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు

డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఐఫోన్‌పై పడనుంది. చైనాపై ట్రంప్ 34 శాతం సుంకం విధించారు. ఇక్కడే ఐఫోన్లు ఎక్కువగా తయారు అవుతాయి. ఈ టారిఫ్‌లు వినియోగదారులపై సంస్థ వేస్తే ఐఫోన్ ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతీకార సుంకం వల్ల ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఒక్కో ఐఫోన్ మోడల్ బట్టి ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ఒక్కో ఫోన్ మోడల్ బట్టి 30 నుంచి 40 శాతం వరకు ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

టారిఫ్‌ల ప్రభావం మొబైల్ ఫోన్లపై..

ఎందుకంటే చైనాలో ఐఫోన్లు తయారు అవుతాయి. ఈ దేశంపై టంప్ 34 శాతం సుంకం విధించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు దీనిపైనే పడతాయి. వీటిని సంస్థ భరిస్తుందా? లేకపోతే వినియోగదారుల మీద వేస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు అనగా రూ. 68 వేలుగా ఉంది. అదే పన్నుల భారం వినియోగదారులపై పడితే మాత్రం 1,142 డాలర్లు అనగా రూ.97వేలకు ఈ మోడల్ ధర చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

యాపిల్ సంస్థ గతంలో అదనపు పన్నులు తప్పించు కోవడానికి ప్రత్యేక మినహాయింపులు పొందింది. కానీ ఇప్పుడు మాత్రం అవేమీ లభించలేదు. ఈ సుంకాల వల్ల యాపిల్ సంస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎందుకంటే సాధారణంగానే వీటి ధరలు అధికంగా ఉంటాయి. ఈ సుంకాల వల్ల ఇంకా ధరలు పెరిగితే.. కస్టమర్లు ఐఫోన్‌ కొనుగోలు విషయంలో వెనుకడుగు వేస్తారని అంటున్నారు. దీనివల్ల యాపిల్ సంస్థపై ప్రభావం ఎక్కువ పడి.. మిగతా సంస్థలకు బాగా లాభం చేకూరుతుంది. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు