Trump: కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో చేర్చాలి

వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని లేకపోతే సుంకాలు పెంచుతామని ట్రంప్‌.. ట్రూడోకు తేల్చిచెప్పారు. ఇలా చేయడంలో విఫలమైతే అమెరికాలో కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చాలంటూ చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

New Update
TRUMP TRUDO

అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాకా.. కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్‌తో సమావేశమయ్యారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని లేకపోతే సుంకాలు పెంచుతామని ట్రంప్‌.. ట్రూడోకు తేల్చిచెప్పారు. అంతేకాదు ఈ విషయంలో విఫలమైతే అమెరికాలో కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చాలంటూ ట్రూడోకు చెప్పారు. అయితే ట్రంప్ ఆయనతో జోక్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. 

Also Read: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అమెరికాకు వెళ్లిన ట్రూడో.. ట్రంప్‌నకు చెందిన మార్ ఏ లాగో అనే రిసార్టులో ఆయనతో భేటీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు సమస్యలు, అక్రమ వలసలు, డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తామని ట్రూడో చెప్పారు. ఒకవేళ వీటిని కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాల్సి వస్తుందని ట్రంప్ ఆయనకు తేల్చిచెప్పడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు.

Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

మరోవైపు ఈ భేటీపై స్పందించిన ట్రంప్.. ఇద్దరి మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కెనడా వస్తు, సేవల ఎగుమతుల్లో 75 శాతం అమెరికాకే ఉంటాయి. ఈ క్రమంలోనే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక.. కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించడం వల్ల కెనడా అలెర్ట్ అయ్యింది. సుంకాలు పెంచితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతుందని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Also Read: మాజీ డిప్యూటీ సీఎం కి టాయిలెట్లు కడిగే శిక్ష..ఎందుకో తెలుసా!

Also Read: భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు