రువాండాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం రేపుతోంది. రక్తనాళాలను నాశనం చేస్తూ రక్తస్రావానికి కారణమవుతున్న మార్బర్గ్ అనే వైరస్ ఆ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఇంకా వందలాది మందికి ఈ వైరస్ సోకి ఉంటుందని రువాండ అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన జ్వరం, రక్తధారలకు కారణం కావడం వల్ల ఈ వైరస్‌ను బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా పిలుస్తారు.
Also Read: సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ !
88 శాతం మరణమే
ఈ వైరస్ సోకితే 88 శాతం మరణం సంభవించే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. గబ్బిలాల్లో ఈ మార్బర్గ్ వైరస్ సహజంగా ఉంటుంది. ఇది ఎబోలా జాతికి చెందిది. ఇప్పటికే ఓరోపైచ్ జ్వరం, ఎంపాక్స్‌కు కారణమయ్యే వైరస్‌లు ఆఫ్రికాలోని 17 దేశాల్లో విస్తరించాయి. దీంతో తాజాగా ప్రయాణికుల రాకపోకలపై అక్కడి ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి.
Also read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?
అయితే మార్బర్గ్ వైరస్‌కు కూడా దాదాపు ఎబోలా వైరస్ వల్ల కలిగే లక్షణాలే ఉంటాయి. ఇది సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, దగ్గు, చలి, గొంతునొప్పి, దద్దర్లు, కండరాల నొప్పి వస్తాయి. అంతేకాదు కొన్నిసార్లు ఛాతినొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, రక్త విరేచనాలు, బరువు తగ్గడం లాంటివి కూడా జరుగుతాయని క్లెవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధలో వెల్లడైంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు మార్బర్గ్ వైరస్‌కు స్పష్టంగా ఎలాంటి యాంటీ వైరల్ చికిత్స లేదు. అలాగే వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవు. వైరల్ జ్వరాలకు పాటించే చికిత్స విధానాన్నే ప్రస్తుతం ఈ వైరస్ సోకినవారికి పాటిస్తున్నారు.
Also Read: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి
Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!