అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు.

New Update
sabarimala

Sabarimala : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తనంథిట్టా జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: 'గోదారి గట్టు మీద రామ చిలకవే' సాంగ్ వచ్చేసింది..రమణ గోగుల ఈజ్ బ్యాక్

పంబా నదిలో ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు మొదలు పెట్టారు. పంబా నదిలో నీటి ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం కూడా పరిశీలిస్తుంది. ఎన్టీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులను ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని అధికారులు సూచించారు. నదులు, అటవీ ప్రాంతాల్లోకి భక్తులను అనుమతించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశాయి.

Also Read: TG Crime: హైదరాబాద్‌లో విషాదం..  నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి

Ayyappa Devotees

ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఘాట్‌లలో స్వాములు స్నానాలకు దిగొద్దని హెచ్చరించారు. వర్షాలు తగ్గి, నదుల్లో నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చే వరకూ ఈ తాత్కాలిక ఆదేశాలు అమల్లో ఉంటాయని పత్తనంథిట్టా కలెక్టర్ ప్రకటించారు.‘‘తీవ్రమైన వర్షాల కారణంగా పర్వత ప్రాంతాలు, అడవులు ముఖ్యంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

అయ్యప్ప భక్తుల వనయాత్రను నిషేధించారు. కేవలం పంపా బేస్‌ నుంచి మాత్రమే స్వాములను అనుమతిస్తున్నారు. శబరిమలకు చేరుకునేందుకు పులిమేడు మార్గం, ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, పంపా బేస్‌ నుంచి చిన్నపాదం మార్గాలు ఉంటాయి. అలాగే, ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు క్లోజ్‌ చేశారు.

Also Read: Aurobindo: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

భారీ వర్షాల నేపథ్యంలో గతవారంతో పోల్చితే అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఈవారం కొంచెం తగ్గింది. వర్షాల వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందుల పడకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చర్యలు చేపట్టింది. అప్పాచిమేడు, నీలమలతో పాటు మరకొట్టం నుంచి శరంగుత్తి వరకూ ఉన్న క్యూలైన్‌లో ఉండే స్వాములు వానలో తడవకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు