Trump: ట్రంప్ మిస్సింగ్ ?.. ఎక్స్‌లో 'ట్రంప్ ఇజ్ డెడ్‌' అని ట్రెండింగ్

ట్రంప్ అనారోగ్యంపై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా ట్రంప్ మీడియా ముందుకు రావడం లేదు. కేవలం తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్ నుంచే సమాచారాన్ని పంచుకుంటున్నారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ట్రంప్ అనారోగ్యంపై ఆందోళనలు నెలకొన్న వేళ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా ట్రంప్ మీడియా ముందుకు రావడం లేదు. కేవలం తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్ నుంచే సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఆగస్టు 30, 31న ఆయనకు ఎలాంటి ప్రజాకార్యక్రమాలు షెడ్యూల్‌లో లేవు. దీంతో ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు మరింత పెరిగాయి.  

Also Read: ట్రంప్ టారిఫ్‌లు, అమెరికా వీసా ఆంక్షలు.. తిప్పికొట్టడానికి ఇండియా మాస్టర్ ప్లాన్ ఇదే!

ఇటీవల ట్రంప్ చేతిపై గాయాలు కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కనిపించకుండా పోవడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి ఓ నెటిజన్ ఎక్స్‌లో సంచలన ట్వీట్ చేశాడు. ''గత 24 గంటలుగా ట్రంప్ కనిపించడం లేదు. మరో రెండ్రోజులు కూడా ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌లు షెడ్యూల్‌లో లేవు. ఇంతకీ అసలేం జరుగుతోంది ?'' అంటూ ప్రశ్నించారు. దీంతో పలువురు నెటిజెన్లు ట్రంప్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరికొందరు అదంతా ఫేక్ ప్రచారమంటూ కొట్టిపారేస్తున్నాయి. ట్రంప్ యాక్టివ్‌గానే ఉన్నారని ట్రూత్ సోషల్‌లో రెగ్యులర్‌గా పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎక్స్‌లో 'ట్రంప్ ఇజ్ డెడ్' అనేది కూడా ట్రెండ్ అవుతోంది. 

Also Read: ట్రంప్ డిజిటల్ పన్నుల ఆగ్రహం వెనుక మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్?

సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉందని.. అందుకే ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ట్రంప్‌కు 79 ఏళ్లు. గత కొన్నిరోజులుగా ఆయన అనారోగ్యంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతితో గాయంతో కనిపించారు. దానికి సంబంధించిన ఫొటో వైరల్ అవ్వడంతో ఆయన అనారోగ్యంపై మరింత అనుమానాలు పెరిగాయి. అంతేకాదు గతంలో ఆ గాయం కనిపించకుండా ఉండేందుకు మేకప్‌ కూడా వేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై ట్రంప్‌  వైద్యుడు సీన్ బార్బబెల్లా కూడా స్పందించారు. ఆ గాయం నిజమేనంటూ చెప్పారు. ఎక్కువగా షేకాండ్ అవ్వడం వల్ల, అలాగే ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా గాయామైనట్లు పేర్కొన్నారు. అలాగే ట్రంప్ పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారంటూ చెప్పారు.

Advertisment
తాజా కథనాలు