ట్రంప్ కీలక నిర్ణయం.. వాటిపై 25 శాతం దిగుమతి సుంకం పెంపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ వారం నుంచే రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్ వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న సుంకాలకు ఇవి కూడా యాడ్ అవుతాయి. అయితే ఈ వారం నుంచే రూల్స్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇటీవల మెక్సికో, చైనా, కెనడా దేశాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే.  

ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!

మొదటిసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు..

ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీకాలంలో కూడా ఉక్కు దిగుమతిపై 25 శాతం,అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు. ఇదిలా ఉండగా ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి చేపట్టిన సమయంలో కూడా ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు. అయితే వాణిజ్య భాగస్వామి దేశాలు అయిన కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి వాటికి మినహాయింపు ఇచ్చారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్‌..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు