/rtv/media/media_files/2025/08/26/postal-2025-08-26-22-47-20.jpg)
Postal Services To India
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠినమైన వాణిజ్య నిర్ణయాలతో ఇండియా నుంచి అమెరికాకు పంపే పార్సిల్ సేవలు నిలిచిపోయాయి. ఆగస్టు 27 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ నిర్ణయం ప్రధానంగా చిన్న వ్యాపారులు, కళాకారులు, సాధారణ ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్తుంటారు. వారి ఫ్రెండ్స్, బంధువులు ఇక్కడి నుంచి వాళ్ల కోసం పార్సిల్ పంపిస్తుంటారు. ఇక నుంచి అలా పంపించలేరు. భారత ప్రభుత్వం ఈ విషయంలో తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది. కానీ ప్రస్తుతానికి, ఆగస్టు 27 నుంచి అమెరికాకు పార్సెల్ సేవలు నిలిచిపోవడం చిన్న ఎగుమతిదారులకు మరియు ప్రజలకు పెద్ద సవాల్‌గా మారనుంది.
BREAKING : India SUSPENDS Postal Services To US Amid Trump Tariffs - Department Of Posts pic.twitter.com/rlewL5xQbv
— Baba Banaras™ (@RealBababanaras) August 23, 2025
మొత్తం 25 దేశాలు అంటున్న ఐరాస
అయితే అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేసినది ఒక్క భారత్ మాత్రమే కాదు మొత్తం 25 దేశాలు అంటోంది ఐక్యరాజ్యసమితిలోని యూనివర్సల్ పోస్టల్ యూనియన్. అన్ని దేశాలపై ట్రప్ విధిస్తున్న సుంకాలే దీనికి కారణం అని చెబుతున్నారు. చిన్న ప్యాకేజీలపై పన్ను మినహాయింపులను ట్రంప్ యంత్రాంగం ఉపసంహరించుకున్న నేపథ్యంలో 25 దేశాలు తమ పోస్టల్ సర్వీసులను ఆపేశాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు సంబంధించిన పోస్టల్ సేవల మధ్య సహకారం కోసం ఏర్పాటైన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. అయితే ఈ సర్వీసులను ఆపేసిన దేశాల పేర్లను మాత్రం ఐరాస చెప్పలేదు. కానీ ఇందులో భారత్ తో సహ ఫ్రాన్స్, జర్మనీ. స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, నార్వే వంటి దేశాలున్నాయని తెలుస్తోంది. అమెరికా రీసెంట్ గా పాస్ చేసిన రూల్ ప్రకారం 800 డాలర్ల విలువైన వస్తువులపై ఉన్న పన్నును మినహాయింపును ఉపసంహరించుకుంది. దీని కారణంగా ఇవన్నీ ఆ దేశం విధించే సుంకాలకు లోబడి ఉంటాయి. దీంతో వాటి ధర రెట్టింపు అవుతుంది. అయితే 100 డాలర్ల విలువైన గిఫ్ట్ ఐటమ్స్, లెటర్స్ వాటికి మాత్రం సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది.
Follow Us