ఢిల్లీకి రానున్న సుందర్ పిచాయ్, శామ్‌ ఆల్ట్‌మన్.. హోటల్‌ ధరలకు రెక్కలు.. ఒక్క రోజుకు రూ.32 లక్షలు

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఈ టెక్‌ దిగ్గజాలు పాల్గొననున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్‌ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

New Update
Delhi Hotels sees demand boom as Pichai, Altman headline AI summit

Delhi Hotels sees demand boom as Pichai, Altman headline AI summit

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఓపెన్ ఏఐ ఫౌండర్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఢిల్లీకి రానున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో అక్కడ జరగనున్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఈ టెక్‌ దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనేక దేశాలు నుంచి ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఢిల్లీలోని హోటల్‌ గదుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో లగ్జరీ సూట్‌ ధర రూ.2 లక్షలు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా రూ.32 లక్షలకు పెరిగిపోయింది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఒక్క రోజుకు తాజ్‌ ప్యాలెస్‌లోని గార్డెన్ లగ్జరీ సూట్ ధర అన్ని ట్యాక్సులతో కలిపి రూ.32 లక్షలుగా ఉంది. సాధారణ రోజుల్లో దీని ధర రూ.2 లక్షలు ఉండేది. మరోవైపు హయత్ యాజమాన్యంలోని అందాజ్‌ ఢిల్లీ హోటల్‌లో సిగ్నేచర్ సూట్ ధర రూ.3.86 లక్షలుగా ఉంది. దేశ, విదేశ ప్రతినిధులు ఈ సమ్మిట్‌ హాజరుకానుండటంతో రూమ్‌ల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయని ఐబిస్ అండ్ ఐబిస్ ఇండియా కమర్షియల్ హెడ్‌ అనిమేశ్ కుమార్ తెలిపారు.

Also Read: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలనం.. 37 ఏళ్ల ఇరాన్ సంప్రదాయానికి బ్రేక్‌

మరోవైపు ఫిబ్రవరి 19,20 తేదీల్లో  లలిత్‌ సూరి హాస్పిటాలిటీ గ్రూప్‌ హోటల్‌లో దాదాపు అన్ని రూమ్స్‌ బుక్‌ అయిపోయాయి. ఈ విషయాన్ని ఆ హోటల్ మేనేజర్ వినీత్ కపూర్ వెల్లడించారు. తాము ఏడుగురు అంతర్జాతీయ నాయకులు, ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ఆతిథుల కోసం ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని.. అలాగే స్థానిక పర్యాటక ప్రదేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామని ఏరోస్‌ హోటల్‌ యాజమాన్యం తెలిపింది.

ఇదిలాఉండగా ఈ ఏఐ సమ్మిట్ కోసం దాదాపు 100 దేశాల నుంచి 35 వేల మంది ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వివిధ దేశాల్లో నాలుగుసార్లు మాత్రమే ఈ సమ్మిట్ జరిగింది. వీటన్నటికంటే భారత్‌లో జరగనున్న సమ్మిట్‌ అతిపెద్దది. 15-20 మంది ప్రభుత్వాధినేతలు, పలువురు విదేశీయ మంత్రులు, అలాగే ఏఐ సంస్థలకు చెందిన 500 మంది ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. భారత్‌లో ఏఐ సమ్మిట్ ఉంటుందని గతేడాదే ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు గ్లోబల్ సౌత్‌ దేశాల్లో నిర్వహిస్తున్న మొదటి ఏఐ సమ్మిట్ ఇదే కావడం మరో విశేషం. ఈ సదస్సు నిర్వహించడం వల్ల అంతర్జాతీయ స్థాయి టెక్‌ సమ్మిట్‌లు రాబోయే రోజుల్లో ఢిల్లీలో మరిన్ని జరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 

Also Read: జపాన్‌లో చరిత్ర సృష్టించిన తొలి మహిళా ప్రధాని.. చెప్పి మరీ కొట్టింది

Advertisment
తాజా కథనాలు