Mosque Attack: మసీదుపై దాడులు.. 50 మంది మృతి

నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్‌ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
Death toll in Nigeria mosque attack rises to 50

Death toll in Nigeria mosque attack rises to 50

నైజీరియాలో మంగళవారం మసీదుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉంగువాన్‌ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 50 మందికి చేరింది. దాదాపు 60 మందిని బందీలుగా తీసుకెళ్లారు. మసీదులో ప్రార్థనలు చేస్తుండానే దుండగులు దాడి చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాదు పలు గ్రామాలపై కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఇది ఉగ్రవాదుల పనేనని పలువురు అధికారులు అనుమానిస్తున్నారు.  అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటిదాకా ఏ సంస్థ ప్రకటించలేదు.

Also Read: భారత్ ను వదులుకుంటే..చైనాకు తలవొంచాల్సిందే - నిక్కీ హేలీ

గతంలో కూడా అక్కడ మసీదులపై దాడులు జరిగాయి. 2022 డిసెంబర్‌లో కట్సినా రాష్ట్రంలో ఓ మసీదుపై దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో 12 మంది మృతి చెందారు. ఇలాంటి దాడులు తరచుగా సాయుధ ముఠాలే చేస్తుంటాయని అక్కడి వారు చెబుతున్నారు. వీళ్ల డబ్బు కోసం కిడ్నాప్, దోపిడీలకు పాల్పడతుంటారని అంటున్నారు. అయితే తాజాగా జరిగిన దాడిలో 50 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. 

Also Read: నువ్వేం పీకలేవు ట్రంప్ అంటున్న రష్యా, భారత్..సుంకాల తర్వాత చమురుపై 5 శాతం డిస్కౌంట్

2022 డిసెంబర్‌లో నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో ఒక మసీదుపై దాడి జరిగింది. ఆ దాడిలో ఇమామ్‌తో సహా 12 మంది మరణించారు. ఇలాంటి దాడులు తరచుగా సాయుధ ముఠాలచే జరుగుతాయి, వీరు డబ్బు కోసం కిడ్నాప్‌లు మరియు దోపిడీలకు పాల్పడుతుంటారు. మరో విషయం ఏంటంటే.. బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ వంటి తీవ్రవాద సంస్థలు ఎక్కువగా ఎక్కువగా మసీదులపై దాడులు చేస్తుండాయి. వాళ్ల సిద్ధాంతాలను వ్యతిరేకించే ముస్లింలపై ఇలాంటి దాడులకు పాల్పడుతారు. తమకు అనుగుణంగా లేని ప్రార్థనా స్థలాలు, ప్రజలను వాళ్లు టార్గెట్ చేసి దాడులు చేస్తుంటారు. మరికొన్నిసార్లు భద్రతా దళాలు చర్యలకు లేదా స్థానిక ప్రజల ప్రతీకార దాడులకు కూడా కూడా సాయుధ ముఠాలు ఇలాంటి దాడులు చేస్తుంటాయి. 

Also Read: నువ్వేం పీకలేవు ట్రంప్ అంటున్న రష్యా, భారత్..సుంకాల తర్వాత చమురుపై 5 శాతం డిస్కౌంట్

Advertisment
తాజా కథనాలు