Strong Warning: భారత్ ను వదులుకుంటే..చైనాకు తలవొంచాల్సిందే - నిక్కీ హేలీ

అమెరికా, భారత్ సంబంధాలు ప్రస్తుతం విచ్ఛిన్న దశలో ఉన్నాయని..వాటిని ఎంత తర్వగా మెరుగుపరుచుకుంటే అంత మంచిదని యూఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను మరోసారి హెచ్చరించారు. భారత్ ను కోల్పోతే చైనా ముందు తలొంచాల్సిందే అన్నారు.

New Update
nikki-trump

Trump-Nikki Haley

భారత్ తో తగువు పెట్టుకోవడంపై అమెరికా మాజీలు, ఎకనామిస్ట్ లు హెచ్చరిస్తున్నారు. అదంత మంచి విషయం కాదని..అమెరికాకే నష్టమని చెబుతున్నారు. తాజాగా అమెరికా మాజీ రాయబారి, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. భారత సంతతికి చెందిన నిక్కీ పదే పదే ఇండియాకు మద్దతును ప్రకటిస్తున్నారు. భారత్ తో దౌత్య సంబంధాలు చెడగొట్టుకుంటే అంత కన్ని పెద్ద తప్పు మరొకటి ఉండని ఆమె అన్నారు. ఇండియాను కీలక ప్రజాస్వామిక భాగస్వామిగా పరిగణించాలని నిక్కీ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కు సూచించారు. భారత్ తో గత 25ఏళ్ళుగా బలమైన సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అవి వదులుకుంటే చైనా ఆధిపత్యం ముందు అమెరికా తలవంచాల్సి వస్తుందని అన్నారు. చైనా, భారత్ ల మధ్య దౌత్య సంబంధాలు బలపడ్డం చాలా ఈజీ అని...ఇప్పటికే ఆ రెండు దేశాలు అటు వైపుగా అడుగులు వేస్తున్నాని నిక్కీ అన్నారు. ఈ విషయాన్ని అమెరికా ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదని హెచ్చరించారు. 

బలమైన దేశంతో సంబంధాలు దూరం చేసుకోవద్దు..

పదిహేను రోజులు తేడాలో నిక్కీ హేలీ...అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను హెచ్చరించడం ఇది రెండో సారి అంతకు ముందు కూడా భారత్ విషయంలో కఠినంగా వ్యవహరించొద్దు అంటూ ట్రంప్ కు సొంత పార్టీ నేత, భారత సంతతి నిక్కీ హేలీ...ట్రంప్ కు సూచించారు. ఇండియా బలమైన దేశం...అలాంటి దానితో సంబంధాలను దెబ్బ తీసుకోకూడదని నిక్కీ అన్నారు. అలాగే చైనా గురించి కూడా ఆమె మాట్లాడారు. చైనా చమురు కొనుక్కుంటే తప్పు లేదు కానీ భారత్ రష్యా నుంచి దిగుమతి చేస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. రష్యా, ఇరాన్ ల నుంచి చైనా అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తోందని చెప్పారు.  ట్రంప్ అలాంటి దేశానికి మాత్రం 90 రోజుల మినహాయింపు ఇచ్చారని...భారత్ తో మాత్రం గొడవ పెట్టుకుంటున్నారని నిక్కీ విమర్శించారు. ట్రంప్ పద్దతి ఏం బాలేదని హెచ్చరించారు. భారత్‌ లాంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని నిక్కీ హేలీ సూచించారు. 

Also Read: Agni-5 Ballistic Missile: పాక్ కు ఇక మూడినట్టే..భారత అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష సక్సెస్

Advertisment
తాజా కథనాలు