Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్‌ తరహా మిస్టరీ వైరస్‌...!

రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి.

New Update
virus russia

virus russia

రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ..దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్‌ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

Also Read: HYD Rape Case: జర్మనీ యువతిపై క్యాబ్ డ్రైవర్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్- జరిగిందిదే!

రష్యాలో మిస్టరీ వైరస్‌ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెల్లువడ్డాయి. పలు నగరాల్లో  ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు,తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని..ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని అవి పేర్కొన్నాయి.

అయితే కొవిడ్‌ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్‌ వచ్చిందని ..ఇది మరో కొత్త వైరస్‌ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని..కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి.ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశాయి.

Also Read: Trump-America:ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి వివరించాయి. మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగాఈ నివేదికలను రష్యన్‌ అధికారులు ఖండించారు.తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని..కొత్త వైరస్‌ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. 

రకరకాల వదంతులు , తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు.నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్థరించారని తెలిపారు.ఒక వేళ కొవిడ్‌ తరహా వైరస్‌ వస్తే దానిని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు ఉన్నాయన్నారు.

Also Read: Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

Also Read:Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో!

 

russia | virus | covid | mystery | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు