/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/coronavirus-12-scaled.webp)
BIG BREAKING: కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో గడిచిన వారంలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయని, ఇప్పటికే మరణాలు నమోదైనట్లు హెచ్చరించింది.
Also Read : సమంతతో డేటింగ్ రూమర్ల వేళ.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య షాకింగ్ పోస్ట్
Also Read : మరో లవ్ స్టోరీతో 'బేబీ' జంట.. క్లాప్ కొట్టిన రష్మిక.. పూజ ఈవెంట్ ఫొటోలు వైరల్
నగరాల్లో పెరుగుతున్న కేసులు..
ఈ మేరకు ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 30 శాతం పెరిగినట్లు వెల్లడించారు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తిచెందటం ఆందోళనకరంగా మారిందంటున్నారు. ఆసియాలోని హాంకాంగ్, సింగపూర్ లోనే వైరస్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు టీకాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. 'నగరాల్లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం అత్యధిక స్థాయికి చేరింది. మే 3 తర్వాత వారంలోనే భారీ కేసులు నమోదయ్యాయి. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్ల కేసులతో పోలిస్తే తక్కువే. కానీ కోవిడ్ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరుతున్నారు' అని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ కమ్యూనికేషన్ డిసీజ్ బ్రాంచ్ అధిపతి ఆల్బర్ట్ ఆయు తెలిపారు.
Also Read: పాక్ అణు స్థావరాన్ని దెబ్బ కొట్టిన భారత్.. సంచలన ప్రకటన!
ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో కంటే కొత్త వేరియంట్ల వ్యాప్తి, తీవ్రమైన కేసులకు సంబంధించిన సూచనలు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. ఇక చైనా కోవిడ్ కేసులను, వ్యాప్తిని పరిశీలిస్తోంది. మే 4 తర్వాత చైనాలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపైనట్లు వైద్యులు తెలిపారు.
Also Read : IPL 2025: ఐపీఎల్ ఓనర్లకు బిగ్ రిలీఫ్.. నిర్ణయం మార్చుకున్న విదేశీ బోర్డ్స్!
covid | asia | telugu-news | today telugu news