/rtv/media/media_files/2025/09/11/group-1-2025-09-11-14-22-49.jpg)
Group 1
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కొరకరాని కొయ్యగా మారింది. 2022లో ఈ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మూడేళ్లైన కూడా ఇంకా ఈ పరీక్షల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారినా కూడా అలాంటి పరిస్థితే ఉంది. రెండు సార్లు పరీక్ష రద్దు కావడం, ఇటీవల మెయిన్స్ ఫలితాలను రద్దు చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్‌ను రద్దు చేయాలని.. జవాబుపత్రాలను మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. 8 నెలల్లోగా రీవాల్యుయేషన్ చేసి ఫలితాలు వెల్లడించాలని.. సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో టీజీపీఎస్సీకి మళ్లీ రీవాల్యుయేషన్ చేయడమా ? లేదా పరీక్షలు నిర్వహించడమా అనేది పెద్ద సవాల్‌గా మారింది.
Also Read: ప్రియుడితో దొరికిన భార్య....అర్థనగ్నంగా ఊరేగించిన భర్త..ట్విస్ట్ ఏంటంటే?
వాస్తవానికి TGPSC నిబంధనల్లోని రూల్ 3(9)(డీ) ప్రకారం ప్రశ్నా పత్రాలను రీవాల్యుయేషన్ చేసేందుకు అవకాశమే లేదు. కానీ హైకోర్టు మాత్రం రీవాల్యుయేన్ చేయాలని కమిషన్‌కు ఆదేశించింది. ఒకవేళ జవాబుపత్రాలు మళ్లీ దిద్దితే టీజీపీఎస్సీ కొత్త చిక్కుల్లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెయిన్స్ పరీక్షలు రద్దు చేయడమే కరెక్ట్ అని సూచనలు చేస్తున్నారు. రీవాల్యుయేషన్ జరిగితే ఇందులో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు మళ్లీ కేసులు వేసే ఛాన్స్ ఉందని.. ఈ వివాదం ఇంకా ముదిరి అలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం మేలని సూచిస్తున్నారు.
Also Read: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దేశవ్యాప్తంగా 8మంది ఉగ్రవాదుల అరెస్ట్..!
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను 21 వేల మంది అభ్యర్థులు రాశారు. ఒక్కో అభ్యర్థి 7 పేపర్లు రాయడంతో మొత్తం ఆన్సర్ పేపర్లు 1.47 లక్షల వరకు ఉంటాయి. టీజీపీఎస్సీ రూల్స్ ప్రకారం జవాబుపత్రాలను ఇద్దరు వాల్యుయేటర్ల ద్వారా మూల్యాంకనం చేయించారు. ఆ తర్వాత మార్కుల్లో 15 శాతం తేడాలు వచ్చాయి. దీంతో మూడోసారి కూడా మూల్యాంకనం చేయించారు. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల మళ్లీ రీవాల్యుయేషన్ చేస్తే గతంలో వేసిన మార్కులపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందని అభ్యర్థులు, నిపుణులు అనుమానిస్తున్నారు. మార్కుల్లో పెద్ద తేడా అనేది ఉండదని మళ్లీ తమకు అన్యాయమే జరుగుతుందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
హైకోర్టు తమ తీర్పుల్లో మోడరేషన్ అనే పదాన్ని వినియోగించింది. అంటే జవాబుపత్రాల రీవాల్యేషన్‌లో ఎలాంటి వివక్షకు తావు అనేదే లేకుండా సమన్యాయం చేయడం దీని అర్ధం. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే భేదం లేకుండా అందరికి సమన్యాయం చేయాలి. జవాబుపత్రాలు దిద్దే వాళ్లలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మార్కులు వేస్తుంటారు. అందుకే తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు రాసిన వాళ్లలో మార్కుల్లో తేడాలు వచ్చాయి. అందుకే పలువురు అభ్యర్థులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష ఒకసారి పేపర్ లీక్ కావడం, ఇంకోసారి బయోమెట్రిక్ వివాదం వల్ల రెండు సార్లు రద్దయ్యింది. ఇప్పుడు మూడోసారి రీవాల్యేషన్ పేరుతో ఫలితాలు రద్దయ్యాయి. దీంతో కష్టపడి చదివిన అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం
మరోవైపు హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. బుధవారం న్యాయ నిపుణులతో ఈ అంశం గురించి చర్చలు జరిపింది. అనంతరం కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం.. ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాక TGPSC రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక గ్రూప్ 1 ఫైనల్ లిస్టులో ఉన్న అభ్యర్థులు సైతం సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై అభ్యంతరాలు తెలుపుతున్నారు.
తమకు ఆఫర్ లెటర్లు ఇవ్వడమే ఇక మిగిలిఉందన్న సమయంలో ఈ తీర్పు రావడంతో వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ఆ అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు రాకుంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెబుతున్నారు. ఇక గ్రూప్ పరీక్ష ఫలితాల తీర్పుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపై కూడా ప్రభావం పడనున్నట్లు సమాచారం.