Putin: భారత్‌కు పుతిన్‌, మతిపోగొట్టే సెక్యూరిటీ.. అయిదంచెలా భారీ భద్రత ఏర్పాట్లు..

భారత్‌-రష్యా వార్షిక సదస్సుకు పుతిన్‌ రానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అయితే ఈ పర్యటనలో పుతిన్‌కు ఏకంగా అయిదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

New Update
Putin

Putin

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు రానున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4,5 తేదీల్లో ఆయన ఇక్కడ పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం నాటికి పుతిన్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌-రష్యా వార్షిక సదస్సుకు పుతిన్‌ రానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అయితే ఈ పర్యటనలో పుతిన్‌కు ఏకంగా అయిదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

రష్యా అధ్యక్షుని సెక్యూరిటీ సర్వీస్‌ నుంచి అత్యంత శిక్షణ పొందిన సిబ్బంది, భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ నుంచి టాప్‌ కమాండోలు, స్నిపర్స్, డ్రోన్స్, జామ్మర్స్‌తో పాటు ఏఐ మానిటరింగ్‌ కూడా పుతిన్ పర్యటనలో ఉండనుంది. మొత్తంగా అయిదు లేయర్లతో కూడిన కట్టుదిట్టమైన భద్రతను ఆయన కోసం ఏర్పాటు చేయనున్నారు. పుతిన్ ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఆయకు రాష్ట్రపతి భవన్‌ వద్ద భారీ స్వాగతం పలకనున్నారు. శుక్రవారం రాజ్‌ఘట్‌లోని మహాత్మగాంధీ మోమోరియల్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత పుతిన్‌ హైదరాబాద్‌ హౌస్ వద్ద జరగనున్న సదస్సులో అలాగే భారత్ మండపంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఇచ్చే విందులో కూడా ఆయన పాల్గొననున్నారు. మరోవైపు పుతిన్ రాకముందే మరింత భద్రత కోసం రష్యాకు చెందిన పలువురు అత్యున్నత భద్రతా సిబ్బంది ఢిల్లీకి చేరుకున్నారు. 

Also Read: టార్గెట్‌ పశ్చిమ బెంగాల్.. SIR పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ పోలీసు అధికారులు, నెషనల్ సెక్యూటీ గార్డు సిబ్బందితో కలిసి ఈ అధికారులు పుతిన్ పర్యటించబోయే ప్రతి మార్గాన్ని శుభ్రం చేస్తున్నారు. ఆయన భద్రత కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఆయన కాన్వాయ్‌ కదలికలపై డ్రోన్ల నిఘా ఉంటుంది. పలు స్నిపర్లు కూడా ఆ రూట్‌లను కవర్ చేస్తారు. జామ్మర్స్‌, ఏఐ మానిటరింగ్, ముఖాన్ని గుర్తించే కెమెరాలు కూడా పుతిన్‌ భద్రతలో అత్యంత కీలకమైనవి.  పుతిన్ భారత్‌లో ల్యాండ్ అవ్వగానే ఈ అయిదంచెలా భద్రత సిబ్బంది వెంటనే యాక్టివ్‌ కానున్నారు. 

ఇదిలాఉండగా ప్రధాని మోదీ, పుతిన్ మధ్య జరగనున్న సమావేశంలో రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. భారత్‌.. రష్యా నుంచి అదనంగా మరో అయిదు ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్‌ స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. అలాగే ఇప్పటికే ఉన్న S-4-00 క్షిపణుల(S-400 Squadrons) నిల్వల భర్తీ కోసం మరో 300 మిసైళ్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే సుఖోయ్‌ 30ఎంకేఐ విమానాల ఆధునికీకరణకు సంబంధించి ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: వామ్మో.. 5,900 అడుగుల ఎత్తులో ఫుట్‌బాల్ గేమ్.. వీడియో వైరల్

మరోవైపు పుతిన్ పర్యటనకు ముందుగానే రష్యా ఓ కీలక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. రెసిప్రొకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS)కు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం  రష్యాకు చెందిన సైనిక విమానాలు, యుద్ధనౌకలు భారత్‌ పంపించేలా దోహదపడనుంది. ఇరుదేశాల మధ్య లాజిస్టికల్ మద్దతును ఈ ఒప్పందం కల్పించనుంది. అలాగే  సైన్యానికి సంబంధించి శిక్షణ, మానవతా సహాయం, విపత్తు సమయంలో రష్యా, భారత్ భవిష్యత్తులో ఒకరికొకరు సహకారం అందించుకోనున్నాయి. 

Advertisment
తాజా కథనాలు