/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
తనను ఇబ్బంది పెట్టిన డీప్‌స్టేట్ ను ఏ మాత్రం సహించేది లేదని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన నిజంగానే అమలు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ కు గుండె కాయ లాంటి సీఐఏ పై ట్రంప్ కోతల ఖడ్గం దుయ్యడానికి రెడీ అయ్యారు. ఆ సంస్థలోని ఉద్యోగులకు బై అవుట్ ఆఫర్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
Also Read: Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!
ఈ విషయంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. అమెరికా లో ప్రభుత్వోద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ట్రంప్ కార్యవర్గం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. ఇటీవల ట్రంప్ ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఉద్యోగం వదులుకుంటే వారికి8 నెలల జీతాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
దీనికి మంగళవారం వరకు గడువు ఉంచారు. కానీ, ఈ ఆఫర్ లోజాతీయ భద్రత తో సంబంధంఉన్న సంస్థలను నాడు చేర్చలేదు. కానీ,కొత్త సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ మాత్రం ఈ ఆఫర్ లో సీఐఏ కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే ఈ ఆఫర్ ను ఉద్యోగులకు తెలియజేశారా,లేదా అన్నదాని పైనా అలాగే ఎవరెవరికీ వర్తిస్తాయనే అంశాలపైనా స్పష్టత లేదు. గత వారం అమెరికాలోని ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ లోని కొందరు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో భాగం కావాలని మార్గదర్శకాలు వెళ్లినట్లు సమాచారం.
సీఏఐలో కొందరు కీలక ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు డీప్ స్టేట్ లో భాగమయ్యారని ట్రంప్ ఆయన సన్నిహితులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.దీనికితోడు సీఐఏ సమాచార సేకరణ, విశ్లేషణలో కొన్ని విభాగాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని కూడా భావిస్తున్నారు.
ఎనిమిది నెలల జీతం...
మొత్తం అమెరికాలోనే ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేందుకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ నుంచి గత నెల ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఒక ఈ మెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇవ్వనున్నట్లు అందులో వివరించారు.
ఫిబ్రవరి 6 వ తేదీలోపు దీని పై ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు.
Also Read: MP Pappu Yadav: రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలి
Also Read: Hyderabad Gold Rates: భగ్గుమంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఇప్పుడు ఎంతంటే ?