/rtv/media/media_files/2025/02/21/lZfCvF7wd6fToFy25jQS.jpg)
Gujarat Road Accident
గుజరాత్ (Gujarat) లోని కచ్(Kachchh) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం గుజరాత్‌లోని కేరా ముంద్రా రోడ్డులో(Kera Mundra Road) 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలు అయినట్లు తెలిసింది.
బస్సు నుజ్జునుజ్జు
వారిలో కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన బాధితులకు సమీపంలోని ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదం ధాటికి బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం.
— greatandhra (@greatandhranews) February 21, 2025
ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు.
ప్రమాదం ధాటికి బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు ఎగిరి రోడ్డుపై పడ్డారు.#RoadAccident #Gujarat pic.twitter.com/AVBC5YTDVC
కేరా ముంద్రా రోడ్డులో 40 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అధికారులు త్వరగా అంబులెన్స్‌లు, పోలీసు యూనిట్లతో సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ప్రమాదం గురించి మరిన్ని వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.