Makki: ముంబై పేలుళ్ల సూత్రధారి.. అబ్దుల్ రెహ్మాన్ మక్కి కన్నుమూత

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు జేయూడీ అధికారికంగా ప్రకటించింది. మక్కీ.. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.  

author-image
By srinivas
New Update
Rehman Makki

Rehman Makki Photograph: (Rehman Makki)

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం లాహోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించినట్లు జేయూడీ అధికారికంగా ప్రకటించింది. మక్కీ.. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD) డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.  

హఫీజ్ సయీద్ బావమరిది.. 

ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారి, జేయూడీ చీఫ్ హఫీజ్ అయిన హఫీజ్ సయీద్ బావమరిది అయిన మక్కీ.. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హాస్పిటల్ చేర్చగా డయాబెటిస్‌కు చికిత్స తీసుకుంటూనే చనిపోయారు. భారత్‌లోని రామ్‌పుర, ఎర్రకోట, ముంబై ఉగ్రదాడుల్లో కూడా మక్కీ కీలక పాత్ర వహించాడు. ఇక ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా యాంటీ-టెర్రరిజం కోర్టు 6 నెలల పాటు మక్కీకి 2020లో జైలుశిక్ష విధించింది. జైలుశిక్ష పడటంతో మక్కీ ప్రభావం తక్కిపోగా.. పాకిస్థాన్‌ భావజాలానికి మక్కీ ఒక  ప్రతిబింబం అని పాక్ ముతహిద ముస్లిం లీగ్ (PMML) పేర్కొంది. అలాగే మక్రీని ఐరాస 2023లో అంతర్జాతీయ టెర్రరిస్టుగా ముద్రవేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన ఆస్తుల జప్తు, ప్రయాణాలపై నిషేధం విధించింది. 

వాంటెడ్ టెర్రరిస్టుగా మక్కీ..

భారత్‌లోని రామ్‌పుర, ఎర్రకోట, ముంబై ఉగ్రదాడుల్లో కూడా మక్కీ కీలక పాత్ర వహించాడు. 166 మంది మరణించిన 26/11 ముంబై టెర్రర్ దాడులకు ఆర్థిక సహాయం అందించడంలో మక్కీ పాలుపంచుకున్నాడు. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. ఒక ఉగ్రవాది అమీర్ అజ్మల్ కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. ముంబై ఉగ్రదాడితో పాటు, మక్కీ ఎర్రకోట దాడిలో పాల్గొన్నందుకు భారత భద్రతా సంస్థలు వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్నాడు. 

Advertisment
తాజా కథనాలు