China plan: ఇండియాని ఒంటరి చేస్తున్న చైనా.. పెద్ద ప్లానే

ఇండియా పొరుగు దేశాలను తనవైపుకు తిప్పుకొని భారత్‌ను ఒంటరిని చేయాలని చైనా ప్లాన్ చేస్తోంది. ఆ దిశగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ దేశాల్లో పలు ప్రాజెక్టుల పేరుతో ప్రవేశిస్తోంది. సీ పోర్టులు, రోడ్లు, ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆయా దేశాల మద్దతు పొందుతుంది చైనా.

New Update

భారత్‌ను ఒంటరి చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. సౌత్ ఏసియాలో బలం పొరుగు దేశాలను తనవైపుకు తిప్పుకుంటూ చైనా పెంచుకుంటుంది. స్ట్రింగ్ ఆఫ్‌ పెరల్స్‌ పేరుతో స్పెషల్‌ ప్రాజెక్టు చేపడుతుంది. అందులో భాగంగా హిందూ మహసముద్రంలో నేవల్ బేస్‌, కమర్షియల్ పోర్టులు నిర్మిస్తోంది. చైనాకు పాకిస్తాన్ పెద్ద మొత్తంలో రుణపడి ఉంది. పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టును చైనా నిర్మించి ఇస్తోంది. అటు  శ్రీలంక కూడా హంబన్‌ టోట పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు అప్పగించింది. ఇప్పటి వరకు ఇండియాకు మద్దతుగా ఉన్న దేశాలను కూడా చైనా తనవైపుకు తిప్పుకొటుంది. ఇది ఇండియాకు పెద్ద సవాల్ లాంటిదే అని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు అంటున్నారు.

నేపాల్‌లోనూ పెద్ద ఎత్తున చైనా ప్రాజెక్టులు దక్కించుకుంది. నేపాల్‌లో పొఖారా ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నది. మాల్దీవ్స్‌లోనూ సేమ్ పరిస్థితి. ఇక ఆ దేశంతోనూ చైనా క్లోస్‌గా ఉంటుంది. క్రమంగా బంగ్లాదేశ్‌ కూడా చైనా వైపు జారిపోతున్నది. బంగ్లాదేశ్‌లో భారీగా చైనా ప్రాజెక్టులు వశమైయ్యాయి. బంగ్లాదేశ్‌లో బెల్ట్ అండ్‌ రోడ్ ఇనిషియేటివ్ కింద ప్రాజెక్టులు, చత్తోగ్రామ్, మోంగ్లా సీపోర్టుల నిర్మాణాలు చైనా చేపట్టింది. బంగ్లాదేశ్‌ ఫస్ట్ సబ్‌మెరైన్ బేస్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఇండియా పోరుగు దేశాలను ట్రాప్ చేసి చైనాకు అనుకూలంగా మార్చుకుంటుంది.

(china | boundaries-of-china | china-army | china india war | pakisthan | nepal | india-vs-srilanka | srilanka | bangladesh | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు