China: చైనా సంచలన నిర్ణయం.. ఆ ఎగుమతులు నిలిపివేత

అమెరికా, చైనా ట్రేడ్‌వార్‌ ముదురుతున్న నేపథ్యంలో చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపివేసింది.దీంతో పశ్చిమ దేశాల్లో ఆటోమొబైల్స్,ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్,సెమీకండక్టర్ల కంపెనీలు సమస్యలు ఎదుర్కోనున్నాయి.

New Update
China Halts Export Of Key Metals

China Halts Export Of Key Metals

అమెరికా - చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ ముదురుతూనే ఉంది. తాజాగా చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను ఎగుమతి చేయడం నిలిపివేసింది. దీనివల్ల పశ్చిమ దేశాల్లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కోనున్నాయి. ఎగుమతలుకు సంబంధించి చైనా ప్రభుత్వం మరిన్ని నిబంధనలు తయారు చేస్తోంది. అప్పటివరకు చైనా పోర్టుల నుంచి మాగ్నేట్‌ ఎగుమతులను నిలిపివేసినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంలో వచ్చింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే పలు కంపెనీలకు శాశ్వతంగా వీటి సరఫరా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: మణిపూర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. వారి వద్ద ఏం దొరికాయో తెలుసా?

China Trade War With US Intensifies

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రారంభించిన ట్రేడ్‌ వార్‌కు ప్రతిస్పందనగా చైనా కీలక విడిభాగాల ఎగుమతులను నిలిపివేసింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90 శాతం చైనా నుంచే వెళ్తున్నాయి. అయితే ఏప్రిల్ 2 నుంచే చైనా వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇప్పటికే చైనాపై ట్రంప్ 145 శాతం టారిఫ్‌లు విధించారు.  దీనికి పరస్పరంగా చైనా 125 శాతం టారిఫ్‌ పెంచింది.  

Also Read: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఇంట్లోకి దూరి మరీ..

చైనా తాజాగా చేపట్టిన చర్యలు కేవలం అమెరికాకి మాత్రమే కాకుండా అన్ని దేశాలపై ప్రభావం చూపించనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్‌లో చైనా తన శక్తిని ఆయుధంగా వాడుతోంది. దీంతోపాటుగా ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌లను కూడా పరిమితం చేసే ఛాన్స్ ఉంది. అమెరికాలో లాక్‌హీడ్‌మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి సంస్థలు ముడిపదార్థాల కోసం చైనాపై ఆధారపడుతున్నాయి. అయితే అమెరికా దగ్గర అరుదైన మినరల్స్ నిల్వలు ఉన్నాయి. కానీ ఇవి తమ డిఫెన్స్‌ కాంట్రాక్టర్లకు సరఫరా చేసేందుకు సరిపోవు. అయితే ఇప్పుడు చైనా ఎగుమతలను నిలిపివేయడంతో అమెరికాకు మరిన్ని ఇబ్బందులు తలెత్తనున్నాయి.  

Also Read: అంతరిక్షయానంలో కీలక ఘట్టం...ఇవాళ అంతరిక్షంలోకి ఆరుగురు మహిళలు

Also Read :  ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్‌స్టార్

 

us trade war with india | america | china | telugu-news | latest-telugu-news | international news in telugu | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు